బ్యాంకులు భద్రత ఏర్పాట్లు చేసుకోవాలి
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:38 PM
సుల్తానాబాద్ పట్టణంలోని పలు బ్యాంకుల నిర్వాహకులు పటిష్టమైన భద్రత, రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ చంద్రకుమార్ బ్యాంకు అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రధాన బ్యాంకులను పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేశారు.
సుల్తానాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ పట్టణంలోని పలు బ్యాంకుల నిర్వాహకులు పటిష్టమైన భద్రత, రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ చంద్రకుమార్ బ్యాంకు అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రధాన బ్యాంకులను పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేశారు.
ఆయా బ్యాంకుల వద్ద ఉన్న రక్షణ చర్యలు ఏటీఎం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు నిర్వహణ అంశాలను పర్యవేక్షించారు. బ్యాంకుల్లోని లాకర్లు సిస్టం, స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. వినియోగదారులతో పాటు అనుమానిత వ్యక్తులు వచ్చిన సందర్భంలో గమనించాలన్నారు. బ్యాంకు లోపల బయట ఉన్న సీసీ కెమెరాలు నిరంతరం పని చేసే విధంగా చూడాలన్నారు. రాత్రి వేళల్లో గార్డుల ఏర్పాటు అంశాన్ని కూడా గమనించాలన్నారు. పోలీసులు రాత్రి వేళ గస్తీ తిరుగుతారని ఏదైనా అత్యవసర సందర్భంలో వెంటనే తమను సంప్రదించాలన్నారు.