Share News

విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పని చేయాలి

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:03 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఉపాధ్యాయులను కలెక్టర్‌ కోయశ్రీహర్ష కోరారు. శనివారం కలెక్టరేట్‌లో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడు కల్లో పాల్గొన్నారు.

విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పని చేయాలి

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఉపాధ్యాయులను కలెక్టర్‌ కోయశ్రీహర్ష కోరారు. శనివారం కలెక్టరేట్‌లో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడు కల్లో పాల్గొన్నారు. సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు ఉపాధ్యా యులను సన్మానించి, మెమెంటోలను అందజేశారు. సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. డీఈవో శారద, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త మల్లేశం, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌: గర్రెపల్లి మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గోల్డీబల్బీర్‌ కౌర్‌ ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందజేసి సన్మానించారు.

ముత్తారం, (ఆంధ్రజ్యోతి): దరియాపూర్‌ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయురాలు ఎం.చైతన్య ఉత్తమ ఉపాధ్యాయురాలుగా కలెక్టర్‌ నుంచి ప్రశంసపత్రం అందుకున్నారు.

Updated Date - Jan 04 , 2026 | 12:03 AM