Share News

రామగుండంలో శానిటేషన్‌పై స్పెషల్‌ డ్రైవ్‌

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:42 PM

రామగుండం నగరపాలక సంస్థలో శుక్ర వారం నుంచి ఈ నెల 11వరకు పారిశుధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహిం చారు. శుక్రవారం 2, 3, 25, 26, 27 డివిజన్లలో స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రామగుండంలో శానిటేషన్‌పై స్పెషల్‌ డ్రైవ్‌

కోల్‌సిటీ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థలో శుక్ర వారం నుంచి ఈ నెల 11వరకు పారిశుధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహిం చారు. శుక్రవారం 2, 3, 25, 26, 27 డివిజన్లలో స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లు ఊడ్చడం, పిచ్చిమొక్కల తొలగింపు, ఖాళీ స్థలాల్లో పేరు కుపోయిన చెట్లను తొలగించారు.

మురుకినీటి కాలువల్లో పూడికను తొలగించి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. పారిశుధ్య పనులను నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ పర్యవేక్షించారు. డిప్యూటీ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి, శాని టరీ ఇన్‌స్పెక్టర్లు నాగ భూషణం, సంపత్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ మధుకర్‌, ఎకో వారియర్‌ ప్రతినిధి మహేందర్‌, మెప్మా సీఓలు ఊర్మిళ, శ్వేత, జవాన్లు అశోక్‌, సుగుణాకర్‌, దయానంద్‌, తిరుపతి, బండారి రవి, సారయ్య, యూసుఫ్‌, సంపత్‌, సోమేష్‌, ఉమామహేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:42 PM