మెడికల్ కళాశాలకు దేహదానం
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:52 PM
గోదావరిఖనికి చెందిన సీనియర్ న్యాయవాది గోషిక ప్రకాష్ మంగళవారం గుండెపోటుతో మరణించాడు. ప్రకాష్ మృతదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం దోహదపడే విధంగా అనాటమీ విభాగానికి అప్పగించి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు.
కళ్యాణ్‌నగర్, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): గోదావరిఖనికి చెందిన సీనియర్ న్యాయవాది గోషిక ప్రకాష్ మంగళవారం గుండెపోటుతో మరణించాడు. ప్రకాష్ మృతదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం దోహదపడే విధంగా అనాటమీ విభాగానికి అప్పగించి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. ప్రకాష్ పార్థివ దేహాన్ని న్యాయవాదులు ఘనంగా నివాళులర్పించి కోర్టు నుంచి మెడికల్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం సిమ్స్ మెడికల్ కళాశాల అనాటమీ హెచ్‌ఓడీ శశికాంత్ ఆధ్వర్యంలో ప్రకాష్ మృతదేహానికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రకాష్ పార్థివ దేహాన్ని దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని, ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించడం గొప్ప విషయమన్నారు. కుటుంబ సభ్యులు తల్లి మల్లమ్మ, భార్య సునీత, కుమారులు విజయ్, వర్షిత్, కూతురు నివేదన ఉన్నారు. న్యాయవాదులు శైలజ, కౌటం సతీష్, సిగిరి సంజయ్‌కుమార్, దేశెట్టి అంజయ్య, కొప్పుల శంకర్, ఉమర్, ముచ్చకుర్తి కుమార్, గోపాల్‌రెడ్డి, పూర్మ శ్రీనివాస్, మేడచక్రపాణి, సదాశయ ఫౌండేషన్ సభ్యులు సాన రామకృష్ణ, కేఎస్ వాసు, లగిశెట్టి చంద్రమౌళి, సురేష్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, ఆర్‌ఎంఓ దండె రాజు, ప్రకాష్ మృతదేహం వద్ద నివాళులర్పించారు.