Share News

కాలువపై బ్రిడ్జి నిర్మించాలని రైతుల నిరసన

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:34 PM

వానాకాలం, కాలువల ద్వారా నీరు విడుదల అయినప్పుడు పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, కెనాల్‌పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని శుక్రవారం రైతులు నీళ్లలో నిలబడి నిరసన తెలిపారు. మండలంలోని సబ్బితం గ్రామ పరిధిలోని డి-83 కెనాల్‌ గుండా సాగు నీరు విడుదల చేశారు.

కాలువపై బ్రిడ్జి నిర్మించాలని రైతుల నిరసన

పెద్దపల్లి రూరల్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): వానాకాలం, కాలువల ద్వారా నీరు విడుదల అయినప్పుడు పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, కెనాల్‌పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని శుక్రవారం రైతులు నీళ్లలో నిలబడి నిరసన తెలిపారు. మండలంలోని సబ్బితం గ్రామ పరిధిలోని డి-83 కెనాల్‌ గుండా సాగు నీరు విడుదల చేశారు. కాలువపై బ్రిడ్జి ఉన్నా నీటి విడుదలతో పూర్తిగా మునిగిపోతుంది. దీంతో రైతులకు తీవ్ర ఇబ్బందికరంగా మారడంతో రైతులు ఆందోళన చేపట్టారు.

పలువురు రైతులు మాట్లాడుతూ కొన్నేళ్లుగా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సమస్య విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డి-83 ఎస్సారెస్పీ కెనాల్‌ ద్వారా నీరు విడుదల కావడంతో సబ్బితం గ్రామ పరిధిలోని రైతుల పంట పొలాలకు నీటిని దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుందని, దీంతో నీరు పైకి వచ్చి విద్యుత్‌ మోటార్లు మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. మోటార్‌ల మరమ్మతుకు వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉందన్నారు. నీటిని దాటుకోని 150 ఎకరాల వరకు సాగు చేసుకుంటున్నామని, నీరు రావడం ద్వారా కూలీలు, రైతులు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. వెంటనే కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రైతులను ఆదుకోవాలని పలువురు కోరారు.

Updated Date - Jan 02 , 2026 | 11:34 PM