Home » Sircilla
ఇదీ.. అదీ అని లేదు.. అన్ని వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుంచి మొదలుకుని కోడిగుడ్డు వరకు అన్నింటికి రెక్కలు వచ్చాయి. తాజాగా కోడిగుడ్డు ధర ఎనిమిది రూపాయల వరకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే తొమ్మిది రూపాయలకు అమ్ముతున్నారు. మరోవైపు ఇసుక ధర ట్రాక్టర్‌కు ఏడు వేల రూపాయలకు చేరింది. దీంతో ఇళ్లు నిర్మించుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అన్ని రకాల సామగ్రి ధరలు పెరిగి నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక ధర పెరగడంతో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉక్కిరిబిక్కరవుతున్నారు.
ప్రతీ పౌరుడికి ఓటుహక్కు కల్పించడంతో పాటు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం బాధ్యత. ఈలక్ష్యంతో రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియ గత నెల 25న ప్రారంభమైంది. అయితే తమ అనుకూల ఓట్లను రద్దు చేసేందుకు సర్‌ను నిర్వహిస్తున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి.
అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్)కు ప్రభుత్వం దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇచ్చింది. జూలై31 వరకు 25శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు చెల్లించుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు నామమాత్రంగానే స్పందన కనిపిస్తోంది.
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కొత్త పాలకవర్గ కమిటీలను నియమించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కసరత్తు మొదలుపెట్టారు. నామినేటెడ్ విధానంలో నియమించా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆయా పదవులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.
రామగుండం గురుకుల పాఠశాల పక్కన గల 26 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ అన్నారు. శనివారం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
సమష్టి కృషితో ఆరు నెలల్లో రాష్ట్రంలో గణనీయమైన మార్పు తీసుక వచ్చేలా ప్రతీ ఒక్క అధికారి పని చేయాలని, వాటి సాధన దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శనివారం వివిధ అంశాలపై ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. శనివారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కు లను పంపిణీ చేశారు.
సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలని, యూరియా యాప్ రాష్ట్రానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
ఒక్కో విద్యార్థి - ఒక్క మొక్క అనే నినాదాన్ని ఆచరణలో పెట్టాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖని సెక్రడ్ హార్ట్ హైస్కూల్‌లో ఏకో క్లబ్‌ను మేయర్ ప్రారంభిం చారు.
విద్యార్థుల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీఆర్‌ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద జీవో 17ను రద్దు చేయాలంటూ రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు.