Share News

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ స్థలపరిశీలన

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:46 PM

రామగుండం గురుకుల పాఠశాల పక్కన గల 26 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేడెట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ అన్నారు. శనివారం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ స్థలపరిశీలన

అంతర్గాం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రామగుండం గురుకుల పాఠశాల పక్కన గల 26 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేడెట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ అన్నారు. శనివారం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, నిర్మాణానికి సంబంధించిన నిధులు ఇప్పటికే మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఏఈ నరేష్‌, ఎంవీఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌, సీనియర్‌ ఇంజనీర్లు ఎమ్మెల్యేను కలిసి నిర్మాణ ప్రణాళికలను వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక సౌకర్యాలతో స్కూల్‌ కాం ప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో విశాలమైన తరగతి గదులు, అత్యాధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, బాలురు, బాలికల ప్రత్యేక సీనియర్‌, జూనియర్‌ హాస్టళ్లు, సిబ్బంది నివాస గృహాలు, పేరెంట్స్‌ వెయిటింగ్‌ హాల్స్‌తోపాటు అన్ని సదుపాయాలు ఉంటాయ న్నారు. ఈ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్టీపీసీ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులను రామగుండం నియోజకవర్గ పరిధి లోనే ఖర్చు చేసి, ఈ ప్రాంతంలో విద్య, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలకు మరింత సహకారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు.

Updated Date - Jul 04 , 2026 | 11:46 PM