Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:43 PM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభు త్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. శనివారం ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి చెక్కు లను పంపిణీ చేశారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పెద్దపల్లిటౌన్‌, జూలై 4 (ఆంఽధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభు త్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. శనివారం ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి చెక్కు లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 578 మంది సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులకు 2 కోట్ల 62 లక్షల 64 వేల750 రూపాయల విలువ గల చెక్కు లు అందజేశారు. పెద్దపల్లి మండలంతో పాటు పట్టణానికి చెందిన 101 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు కోటి రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ అనా రోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందిస్తుంద న్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు కొనసాగిస్తూ పేద, మధ్యతరగతి కుటుంబా లకు అండగా నిలు స్తున్నామన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహిళలకు ఉచిత బస్సు, సన్న వడ్లకు బోనస్‌, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, పెద్దపల్లి మున్సి పల్‌ ఛైర్మన్‌, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతిని ధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 11:43 PM