Share News

ఒక్కో విద్యార్థి - ఒక మొక్క నాటాలి

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:29 PM

ఒక్కో విద్యార్థి - ఒక్క మొక్క అనే నినాదాన్ని ఆచరణలో పెట్టాలని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖని సెక్రడ్‌ హార్ట్‌ హైస్కూల్‌లో ఏకో క్లబ్‌ను మేయర్‌ ప్రారంభిం చారు.

ఒక్కో విద్యార్థి - ఒక మొక్క నాటాలి

కోల్‌సిటీటౌన్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఒక్కో విద్యార్థి - ఒక్క మొక్క అనే నినాదాన్ని ఆచరణలో పెట్టాలని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖని సెక్రడ్‌ హార్ట్‌ హైస్కూల్‌లో ఏకో క్లబ్‌ను మేయర్‌ ప్రారంభిం చారు. మేయర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా సుస్థిర భారత నిర్మాణానికి తోడ్పడాలని విద్యార్థులకు సూచిం చారు. సెక్రడ్‌ హార్ట్‌ హైస్కూల్‌ పరి శుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తోందని అభినందించారు.విద్యార్థులు మాతృ భూమి, పర్యావరణ పరిరక్షణ అం శాలపై నృత్యాలు, నాటికలు, ప్రసంగాలతో ఆకట్టు కున్నారు. విద్యార్థులందరూ ఏకో ప్రతిజ్ఞ చేశారు. నాయకులు దాసరి విజయ్‌, ఏకో క్లబ్‌ ఇన్‌చార్జిలు విజయ, పాఠశాల ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ ఆరోగ్య మేరీ, ఆఫీస్‌ ఇన్‌చార్జి విజయ, ఎన్‌సీసీ అధికారి జ్యోత్స్న, నవకళ, తిరుమల, ఝాన్సీ, అలివేణి, ఆయేషా పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:29 PM