విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటం
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:27 PM
విద్యార్థుల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీఆర్‌ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద జీవో 17ను రద్దు చేయాలంటూ రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు.
పెద్దపల్లిటౌన్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీఆర్‌ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద జీవో 17ను రద్దు చేయాలంటూ రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడి చినా యూనిఫాం, నోట్ బుక్కులు అందకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 17 వల్ల తెలంగాణలోని చిన్న కాంట్రాక్టర్లు, చేనేత కార్మికుల పొట్టకొడుతున్నారని, ఈ విధానం వల్ల రాష్ట్ర సంపద ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందని విమర్శించారు. చేనేత కార్మికులకు దక్కా ల్సిన కాంట్రాక్టులను గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టడం వెనుక పెద్ద కుంభ కోణం ఉందని ఆరోపించారు. గురుకులాల్లోని అవినీతిపై పోరాడుతున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను రాజకీయ కక్షతో తొలగించడం దారుణ మని, హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని మండి పడ్డారు. విద్యార్థులకు అందజేసే ట్రంక్ పెట్టల కాంట్రాక్టును డ్రగ్స్ కేసుల్లో నిందితుడైన వ్యక్తికి అప్పగించడం సిగ్గు చేటన్నారు. పోలీసులు ఆందోళనకా రులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీరం రవి,బండ నిఖిల్, రాహుల్ ,అజీమ్, కన్నం శ్రావణ్, శంకర్, మహేష్ పాల్గొన్నారు.