Home » Sircilla
జిల్లాలో మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. 74 ఏ4 షాపులకు 1507 దరఖాస్తులు రాగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ డ్రా ద్వారా లైసెన్స్ దారులను ఎంపిక చేశారు. ఈ టెండర్లలో 15 మద్యం షాపులను మహిళలు దక్కించుకొన్నారు.
మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు సంఘటితంగా పోరాటం చేయాలని, భవి ష్యత్ తరాలకు డ్రగ్స్ మహమ్మారి నుంచి విముక్తి కలిగించాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి (డీఎల్ఎస్ఏ) స్వప్నారాణి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జిల్లా నశాముక్త్ భారత్ అభియాన్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించేలా ముగ్గుల పోటీలు నిర్వహించారు.
విద్యార్థు లకు పోలీసు శాఖ విధులపై అవగాహన కలిగి ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. సోమవారం కమిషనరేట్ కార్యాల యంలో పోలీస్ విధులపై ఓపెన్‌హౌస్ నిర్వహిం చారు.
ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఓదెల మం డలం జీలకుంట గ్రామానికి చెందిన దార సతీష్ అదనపు కలెక్టర్ డి వేణుకు విజ్ఞప్తి చేశారు. ఆయన తహసీల్దార్‌ను విచార ణకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
జిల్లాలో గల మద్యం షాపులకు లైసెన్స్‌దారులను ఎంపిక చేసేందుకు సోమవారం డ్రా తీయనున్నారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బంధంపల్లిలో గల స్వరూప గార్డెన్లో ఉదయం 11 గంటలకు డ్రా తీయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 9వ తేదీలోగా పీఆర్సీ ప్రకటించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఎంబి గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు.
పత్తి రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం రాఘవ పూర్ శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అసత్య ఆరోపణలు చేయడాన్ని సహించేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలను బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్ష పదవుల భర్తీ ప్రక్రియ కొలిక్కి వస్తున్నది. రెండు, మూడు రోజుల్లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేదెవరో తేలిపోనున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు, నగర అధ్యక్ష పదవులకు పరిశీలకులు అందించిన పేర్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సమీక్షించి షార్ట్‌లిస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటికిప్పుడు వరదలు నిలిచి పోయినా పూర్తి స్థాయి ఆయకట్టు రెండో పంటకు నీరందించడానికి ప్రాజెక్టులో పుష్కలంగా నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి స్వల్పంగా 20 వేల క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది.