అన్ని పార్టీల్లో సందడి
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:42 AM
పురపోరు సమయం సమీపిస్తుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సిరిసిల్ల, వేములవాడ మునిసిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థులపై గల్లీ, గల్లీలో చర్చ మొదలైంది. మద్దతుదారుల సమీకరణలతో ఆశా వహులు హడావుడి చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పురపోరు సమయం సమీపిస్తుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సిరిసిల్ల, వేములవాడ మునిసిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థులపై గల్లీ, గల్లీలో చర్చ మొదలైంది. మద్దతుదారుల సమీకరణలతో ఆశా వహులు హడావుడి చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు వామపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. గల్లీ చిన్నదైనా పార్టీలకు మునిసిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మ కంగా ఉండడంతో పెద్ద పోరుగా మారనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీల స్థితిగతులు, అభ్యర్థుల ఎంపికపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఆరా తీయడం మొదలు పెట్టింది. ఇప్పటికే సిరిసిల్లలో బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కే తారకరామారావు, కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ వారి పార్టీల ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించడంతో మునిసిపల్ ఎన్నికల వేడి పెరిగింది. అసెంబ్లీ సమా వేశాల తర్వాత కాంగ్రెస్ మంత్రులు, ,ఎమ్మెల్యేలు ఎన్నికల వైపు దృష్టి పెట్టడానికి సన్నద్ధమయ్యారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఈసారి సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల వైపు వ్యూహాత్మకంగా అడు గులు వేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు సిరిసిల్ల, వేములవాడలో పోటీ చేసే అభ్యర్థుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్ అంతగా తన ప్రాబల్యాన్ని చూపలేకపోయింది. కేవలం రెండు సీట్లతో నే సరిపెట్టుకుంది. బీజేపీ నుంచి ముగ్గురు గెలు పొంద గా బీఆర్‌ఎస్ నుంచి 16 మంది, బీఆర్‌ఎస్ రెబల్స్ 12 మంది గెలుపొందారు. రెబల్స్‌ను మళ్లీ కలుపుకొని సిరిసిల్ల బల్దియాపై గులాబీ జెండా ఎగురవేశారు. వేములవాడలో బీఆర్‌ఎస్ 16 మంది బీజేపీ ఆరుగురు, కాంగ్రెస్ ఒకరు, స్వతంత్రులు అయిదుగురు గెలుపొం దారు. బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేసింది. ఈసారి రెండు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని చూసు కునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలో తలనొప్పిగానే కనిపిస్తోంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో రెబల్స్ గుబులు
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39 వార్డుల్లో ఆశా వహులు ఎక్కువ సంఖ్యలోనే ముందుకు వస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బీఆర్‌ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో సిరిసిల్ల మున్సిపాలిటీ ప్రతిష్టాత్మకంగా మారింది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటారని ఆ పార్టీలో పోటీకి సిద్దమవుతున్న వారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. 2020 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలు టిక్కెట్లు ఇవ్వడంలో అంచనాలు తప్పినట్లు విమర్శలు వచ్చాయి. విమర్శలను నిజం చేస్తూ 12 మంది రెబల్స్ అభ్యర్థులు గెలుపొందడం నిదర్శనంగా మారింది. ఈసా రి మళ్లీ అదే పొరపాటు చేసే అవకాశం లేక పోలేదు. అదే జరిగితే కాంగ్రెస్ జెండా ఎగర వేస్తుందని బీఆర్ ఎస్ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతుంది.
ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిరిసిల్ల , వేములవాడ రెండు మున్సిపాలిటీలు గెలుపొందడం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. సిరిసిల్ల, వేములవాడ బీఆర్‌ఎస్ కంచు కోటగా ఉంది. పార్టీని మరింత పటిష్టంగా మార్చడమే కాకుండా రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత అభ్య ర్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. బీజేపీ గత లోక్‌పభ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల నుంచి వచ్చిన ఆదరణ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పొందాలని ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతోంది. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ సిరిసిల,్ల వేములవాడ మున్సిపాలిటీలపై దృష్టి పెట్టడంతో మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీగా మున్సిపాలిటీ ఎన్నికలు కనిపిస్తున్నాయి.
ఓటరు జాబితాలపై దృష్టి
సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల నుంచి పోటీకి సిద్ధమైన ఆశావహులు ఓటరు ముసాయిదా జాబితాలపై దృష్టి పెట్టారు. తాము పోటీ చేసే వార్డులోని ఓటర్లు వేరే వార్డుల్లో జాబితాలో చేరాయా లేక ఇతర వార్డులోని ఓటర్లు తమ వార్డులోకి వచ్చాయా అని తనిఖీ చేశారు. స్వయంగా ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తున్నారు. వార్డుల్లో తిరుగుతూ తమ ఓటర్లు ఇతర వార్డులో జాబితాలో ఉంటే వాటిని తిరిగి తమ వార్డుల్లో చేర్చే విధంగా మునిసిపల్ కార్యాలయాల్లో స్వయంగా వెళ్లి ఓటర్ల తరఫున దరఖాస్తులు అందిం చారు.
ఎన్నికల హడావుడి
ఓటరు జాబితా ప్రకటించడంతోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని హడావుడి పెరిగింది. సిరిసిల్ల వేములవాడ రెండు మున్సిరెండు మున్సిపాలిటీల్లో 67 వార్డులు ఉండగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం 1,22,836 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 59,522 మంది, మహిళలు 63,290 మంది, జెండర్లు 24 మంది ఉన్నారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. పురుషుల కంటే 3,768 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 81,959 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 39,942 మంది, మహిళలు 42,011 మంది, జెండర్లు ఆరుగురు ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 40,877మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,580 మంది, మహిళలు 21,279 మంది, జెండర్లు 18మంది ఉన్నారు. ఇందులో మహి ళలు 1,699 మంది ఎక్కువగా ఉన్నారు. ఈ నెల 10న తుది ఓటరు జాబితా వెల్లడితోనే ఎన్నికల షెడ్యూల్, నోటిపికేషన్ రానున్నట్లు భావిస్తున్నారు.