Share News

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:51 PM

గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు పరి ష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ గంగాధర్‌ అన్నారు. మంగళవారం ముత్తారం, బొంపల్లి గ్రామాల్లో ప్రజాబాట నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీల వద్ద గ్రామ సభలు నిర్వహిం చారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

పెద్దపల్లి రూరల్‌, జనవరి 6 (ఆంధ్ర జ్యోతి): గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు పరి ష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ గంగాధర్‌ అన్నారు. మంగళవారం ముత్తారం, బొంపల్లి గ్రామాల్లో ప్రజాబాట నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీల వద్ద గ్రామ సభలు నిర్వహిం చారు. ముత్తారంలో పాల్గొన్న ఎస్‌ఈ గంగా ధర్‌ మాట్లాడుతూ వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకోని లో వోల్టేజి, ఓవర్‌ లోడ్‌ సమస్య లను నివారించేందుకు సమస్యలు తెలుసు కుంటున్నట్లు తెలిపారు. విద్యుత్‌ వినియోగ దారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేం దుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్‌ నల్లగొండ కుమార్‌, కార్యదర్శి శ్రీనివాస్‌ అధికారులు పాల్గొన్నారు. బొంపల్లిలో విద్యుత్‌ శాఖ ఏఈ రవిచందర్‌ ఆధ్వర్యంలో సమావే శం నిర్వహించి సమస్యలపై చర్చించారు. సర్పంచ్‌ దాడి మౌనిక-సంతోష్‌, ఉప సర్పంచ్‌ రాజు, కార్యదర్శి సంపత్‌ పాల్గొన్నారు.

కళ్యాణ్‌నగర్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రజాబాట కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్టు ట్రాన్స్‌కో ఏడీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. మంగళవారం కార్పొరేషన్‌లో 14, 45, 23 వార్డుల్లో విద్యుత్‌ సమస్యలు తెలుసుకున్నారు. ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాటలో అధికారులు పర్యవేక్షించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నట్టు తెలిపారు. ఏఈలు రచన, వంశీ కృష్ణ, సంపత్‌తో పాటు విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నెలకొన్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరిస్తామని ఏడీఈ రామస్వామి అన్నారు. నారాయణపల్లిలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రజాబాటలో మాట్లాడుతూ వేసవిలో ఎలాంటి లో వోల్టేజీ సమస్యలు లేకుండా ప్రజలు, రైతులకు మెరుగైన విద్యుత్‌ను అందిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామాల్లో లూజు వైర్లు, స్తంభాల కొరత, ట్రాన్స్‌ఫార్మర్‌ల సమస్యలను తొలగించాలని అధికారు లను గ్రామస్థులు కోరారు. వైకుంఠధామానికి పూర్తి స్థాయి విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు రంగు లత శ్రీనివాస్‌, కొత్తిరెడ్డి బాపురెడ్డి, కార్యదర్శి పాపన్న, సబ్‌ఇంజనీర్లు అనిల్‌ నాయక్‌, లైన్‌మెన్‌ రాజ్‌కుమార్‌, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పాలకుర్తి,అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): విలేజ్‌ అంత ర్గాంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఏఈ శంకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ ప్రజలకు విద్యుత్‌ సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరించడంతోపాటు, వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బం ది ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. సర్పంచ్‌ దారవేణి జ్యోతి, విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): మంచిరామిలో విద్యు త్‌ శాఖ అధికారులు ప్రజాబాట నిర్వహించారు. అధికా రులు గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. సర్పంచ్‌ ఉప్పు లక్ష్మి, ఉపసర్పంచ్‌ ఎగుర్ల శ్రీనివాస్‌, వార్డుసభ్యులు, కార్యదర్శి రాజేష్‌కుమార్‌, ఏఈ దామో దర్‌, లైన్‌ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మినారాయణ, లైన్‌మెన్‌ కుమార స్వామి పాల్గొన్నారు. పూసాలలో విద్యుత్‌ అధికారులు ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టగా, సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - Jan 06 , 2026 | 11:51 PM