మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:49 PM
మధ్యవర్తిత్వంతో కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని, మధ్యవర్తిత్వానికే మద్దతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీతా పేర్కొన్నారు. జిల్లా కోర్టు భవ నంలో బుధవారం న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వంఅనే అంశంపై జిల్లా జడ్జీ, సీనియర్ జూనియర్ న్యాయాధికారులు, కక్షిదారులతో సమీక్ష నిర్వ హించారు.
పెద్దపల్లిటౌన్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వంతో కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని, మధ్యవర్తిత్వానికే మద్దతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీతా పేర్కొన్నారు. జిల్లా కోర్టు భవ నంలో బుధవారం న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వంఅనే అంశంపై జిల్లా జడ్జీ, సీనియర్ జూనియర్ న్యాయాధికారులు, కక్షిదారులతో సమీక్ష నిర్వ హించారు. ఆమె మాట్లాడుతూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుం డడంతో కోర్టులపై భారం పడుతోందన్నారు. సమస్యకు పరిష్కార మార్గం గా మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ఇరుపక్షాల మధ్య సంబంధాలు చెడిపోకుండా సమస్యకు ముగింపు ఉంటుందని, సివిల్ కేసులు, కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, వాణిజ్య వివాదాలు వంటి అంశాల్లో మధ్యవర్తిత్యం విజయవంతంగా అమలవుతోందని వివరించారు. కోర్టులు కూడా అనేక సందర్భాల్లో కేసులను మధ్యవర్తిత్యానికి పంపిస్తూ, త్వరగా న్యాయం అందించేందుకు ప్రోత్సహిస్తున్నాయన్నారు. మధ్యవర్తిత్యంతో కోర్టుల భారం తగ్గించడమే కాకుండా స్నేహపూర్వక న్యాయం అందించే సాధనంగా నిలుస్తోందన్నారు. అదనపు జడ్జీ కే స్వప్న రాణి, సీనియర్ సివిల్ జడ్జీ విభవాని, జూనియర్ సివిల్ జడ్జి ఎన్ మంజుల, న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు.