Share News

మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లపై తర్జనభర్జన

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:49 PM

మున్సిపల్‌ ఎన్నికల రిజ ర్వేషన్లపై తర్జనభర్జన జరుగుతోంది. మున్సిపల్‌ చట్టం-2019 ప్రకారం మున్సిపాలిటీల్లో వరుసగా రెండు సార్లు ఒకే రిజ ర్వేషన్‌ కొనసాగించాల్సి ఉంటుంది. 2020లో జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో ఏ రిజర్వేషన్‌ అయితే వార్డులు, చైర్మన్‌ పదవులు ఉన్నాయో, అదే విధంగా ఈసారి కూడా రిజర్వేషన్‌ కావాల్సి ఉంటుంది.

మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లపై తర్జనభర్జన

కోల్‌సిటీ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల రిజ ర్వేషన్లపై తర్జనభర్జన జరుగుతోంది. మున్సిపల్‌ చట్టం-2019 ప్రకారం మున్సిపాలిటీల్లో వరుసగా రెండు సార్లు ఒకే రిజ ర్వేషన్‌ కొనసాగించాల్సి ఉంటుంది. 2020లో జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో ఏ రిజర్వేషన్‌ అయితే వార్డులు, చైర్మన్‌ పదవులు ఉన్నాయో, అదే విధంగా ఈసారి కూడా రిజర్వేషన్‌ కావాల్సి ఉంటుంది. కానీ పంచా యతీ ఎన్నికల్లో ఐదేళ్ల కాలపరిమితికి కుదిరించి ప్రభుత్వం రొటేషన్‌ చేసింది. దీంతో పాటు రిజర్వేషన్‌ చేసే విధానంలో కూడా మార్పులు చేసింది. ఈ విధానం అనుసరిస్తే 50శాతం రిజర్వేషన్లు మించకుండా నిర్ణయించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్‌సీలకు 15శాతం, ఎస్‌టీలకు 7.5శా తం, బీసీలకు 27.5శాతం రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆయా గ్రామ పంచాయతీల్లో దీని ప్రకారమే వార్డులు రిజర్వేషన్‌ చేశారు. 2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్‌ను ఖరారు చేశారు. మున్సి పాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్‌సీ, ఎస్‌టీలకు వార్డులు రిజర్వు చేశారు. మున్సి పాలిటీల వారీగా ఎస్‌సీ, ఎస్‌టీ జనాభా ప్రకారం రిజర్వేషన్‌ శాతాన్ని పెంచారు.

2020లో జరిగిన ఎన్నికల్లో రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలి టీల్లో రాష్ట్ర యూనిట్‌ విధానాన్ని అనుసరించి రిజర్వేషన్‌ ఖరారు చేశారు. ఎస్‌సీ జనాభా ఎక్కువగా ఉన్న రామగుం డంలో ఎస్‌సీలకు 15కు బదులు 22శాతం, బీసీలకు 27 శాతా నికి బదులు 26శాతం, ఎస్‌టీలకు 7.5శాతానికి బదులు 2శాతం సీట్లు రిజర్వు అయ్యాయి. 50డివిజన్లకుగాను ఎస్‌సీ లకు 11డివిజన్లు, బీసీలకు 13డివిజన్లు, ఎస్‌టీలకు ఒక డివిజన్‌ కేటాయించారు. పెద్దపల్లిలో 36వార్డులకు ఎస్‌టీలకు ఒకటి, ఎస్‌సీలకు 4(11శాతం), బీసీలకు 13(36శాతం) కేటా యించారు. సుల్తానాబాద్‌లో 15వార్డుల్లో ఎస్‌టీ ఒకటి, బీసీ లకు 4, ఎస్‌సీలకు 2(13శాతం) కేటాయించారు. మంథనిలో 13వార్డులకు గాను ఎస్‌టీ 1, ఎస్‌సీ2, బీసీ3 కేటాయించారు.

పంచాయతీ విధానాన్ని అనుసరిస్తే హెచ్చుతగ్గులు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్‌ విధానాన్ని అనుసరిస్తే రొటేషన్‌లో రామగుండం మేయర్‌తో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు మారుతాయి. అలాగే పెద్దపల్లి, మంథని, సుల్తానా బాద్‌ల్లో వార్డులు కూడా రొటేషన్‌ అవుతాయి. రామగుండంలో డివిజన్ల పునర్విభజన జరిగినందున హద్దులు మారాయి. దీంతో డివిజన్ల రొటేషన్‌కు అవకాశాలు తక్కువ. దీంతో పాటు ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు కేటాయించిన సీట్ల సంఖ్యలోనూ తేడాలు రానున్నాయి. బీసీలకు 27శాతం, ఎస్‌సీలకు 15శాతం, ఎస్‌టీకు 7.5శాతం కేటాయిస్తే 60డివిజన్లలో బీసీలకు 16, ఎస్‌సీలకు 9, ఎస్‌టీలకు 4 రిజర్వు అయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఎస్‌సీ రిజర్వు అయ్యే డివిజన్ల సంఖ్య తగ్గుతుంది. అదే సమయంలో బీసీలకు 5, ఎస్‌టీలకు 3 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఎస్‌సీలకు రెండు సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టత లేకపోవడంతో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల్లో గందరగోళం నెలకొంటుంది. రొటేషన్‌ ఉంటుందా, పంచాయతీ ఎన్నికల విధానాన్ని అవలంభించి రిజర్వే చేస్తారా అనే విషయాలపై తర్జన భర్జన జరుగుతుంది. అధికార యంత్రాంగానికి కూడా సరైన సమాచారం లేదు.

Updated Date - Jan 06 , 2026 | 11:49 PM