జనరల్ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:54 PM
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెం చాలని, నెలలు నిండిన గర్భిణీలను క్షేత్రస్థాయిలో నిరం తరం సంప్రదించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధి కారి ప్రమోద్‌కుమార్ సూచించారు.
కళ్యాణ్‌నగర్, జనవరి 7(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెం చాలని, నెలలు నిండిన గర్భిణీలను క్షేత్రస్థాయిలో నిరం తరం సంప్రదించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధి కారి ప్రమోద్‌కుమార్ సూచించారు. బుధవారం సిమ్స్ మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో పట్టణ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు, అంతర్గాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్య అధికారులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, జనరల్ ఆసుపత్రి గైనకాలజీ విభాగం అధిపతులతో సమావేశం నిర్వహించారు. బర్త్ ప్లానింగ్ జరిగేలా ప్రణాళిక రూపొందించాలని, ప్రసవాలు నిర్వ హించడంలో గైనకాలజిస్ట్‌లు, నర్సింగ్ సిబ్బంది, ఉచితంగా టిప్ఫా స్కానింగ్ ఉందన్నారు. ప్రతి ఆశా కార్యకర్త ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గర్భిణీలను ప్రభు త్వాసుపత్రికి తీసుకురావాలని ఆదేశించా రు. ఎన్‌సీడీ అసంక్రమిత వ్యాధులు, స్ర్కీ నింగ్‌లో కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, మెడికల్ ఆఫీసర్లు వారానికి 20కేసులు, ఎంఎల్ హెచ్‌పీలు వారానికి 50కేసులను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని సూచించారు. మధుమేహం, రక్తపోటు కేసును నమో దు చేయాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో క్యాన్స ర్ స్ర్కీనింగ్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయని, రెఫరల్ కేసులను మెడికల్ ఆఫీసర్లు పరిశీలించాలని, డే కేర్ క్యాన్సర్, కీమోథెరపీ సేవలు అందుబాటులోకి వచ్చా యని, వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. వందశాతం వ్యాక్సినేషన్ సాధించాలని, పీహెచ్ సీల్లో ఓపీ సంఖ్య పెంచాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రోగ్రాం అధికారులు రాజ మౌళి, వాణిశ్రీ, శ్రీరాములు, కిరణ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అరుణ్, శ్రీదేవి పాల్గొన్నారు.