కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:47 PM
ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమా ణాలు అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం చందనాపూర్ జడ్పిహెచ్‌ఎస్, రత్నాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు.
రామగిరి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమా ణాలు అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం చందనాపూర్ జడ్పిహెచ్‌ఎస్, రత్నాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పరిశీలించారు. వసతులు, విద్యార్థులు వివరాలను యూఐ డీసీలో అప్‌డేట్ చేయాలని సూచించారు. రత్నాపూర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీని పరిశీలించారు. లద్నాపూర్ సర్పంచ్ వనంరాంచందర్‌రావు గ్రామస్థులు ఆర్‌అండ్‌ఆర్ లక్ష్మినగర్‌లో పలు సమస్యలను కలెక్టర్ దృష్టి తీసికెళ్ళారు. సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాలనీలో వసతులు కల్పించే బాధ్యత సింగరేణిపై ఉందని కలె క్టర్‌కు లద్నాపూర్ గ్రామస్థులు తెలిపారు. సింగరేణి అధికారులతో ఆర్‌అండ్ ఆర్ ప్లాట్ల ఎదుట సమస్యల పరిష్కారంపై మాట్లాడారు. సత్వరం మౌలిక వసతులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ సుమన్, సింగరేణి ఎస్టేట్ అధికారి ఐలయ్య, అధికారులు పాల్గొన్నారు.
కమాన్‌పూర్, (ఆంధ్రజ్యోతి): ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. పలు పాఠశాలలను పరిశీలించి పిల్లలకు అందుతున్న విద్యాప్రమాణాలపై ఉపాధ్యాయులను తెలుసుకున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. అవసరం మేరకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ తెలిపారు. మండలంలో నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయ భవన పను లను పరిశీలించి రెండు నెలల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసు కురావాలని ఆదేశించారు. తహసీల్దార్ సుమన్, ఎంపీడీఓ శైలజరాణి, మంథని డీఈ పీఆర్ అప్పల నాయుడు, ఏఈలు వరలక్ష్మి, జగదీష్‌తోపాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
పెద్దపల్లి కల్చరల్, జనవరి6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యాశాఖలో చేప ట్టిన పలు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ టీజీ ఈడబ్ల్యూ ఐడిసి ద్వారా జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలన్నారు. గోదావరిఖనిలోని శాతవాహన యూనివ ర్సిటీ అడ్మిన్ బ్లాక్ నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. జిల్లా విద్యాధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ అధికారి షేక్, టీజీఈడబ్ల్యు ఐడీసీ ఈఈ అశోక్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన తదితరులు పాల్గొన్నారు.