మినీ మేడారంగా సమ్మక్క -సారలమ్మ జాతర
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:51 PM
గోదావరిఖని గోదావరి వద్ద సమ్మక్క -సారలమ్మ జాతర మినీ మేడారం జాతరలా నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ చెప్పారు. బుధవారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద వన దేవతల పునః ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు పూజలు నిర్వహించారు.
కోల్‌సిటీ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని గోదావరి వద్ద సమ్మక్క -సారలమ్మ జాతర మినీ మేడారం జాతరలా నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ చెప్పారు. బుధవారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద వన దేవతల పునః ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ మేడారంను తలపించేలా గోదావరి ఒడ్డున సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ సహకారంతో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నీ ఏర్పాట్లను చేసినట్టు, రూ.6.5కోట్లతో సుందరంగా జాతర ప్రాంగణాన్ని తీర్చిదిద్దినట్టు ఆయన చెప్పారు. లైటింగ్, విద్యుత్, శానిటేషన్, భద్రతపై అధికారులు సమన్వయంతో పని చేయాలని, జాతరకు 5లక్షల నుంచి 6లక్షల మంది వస్తారన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. గోలివాడ జాతరకు కూడా రూ.1కోటి కేటాయిం చినట్టు పేర్కొన్నారు. జాతరలో జరు గుతున్న పనులను పరిశీలించి అధికా రులకు పలు సూచనలు చేశారు. పుష్కరఘాట్ అపరిశుభ్రంగా కనిపిం చడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీపీ మడత రమేష్, ఏసీఓ సుప్రియ, ఈఓ కాంతరెడ్డి, కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, కాల్వ లింగ స్వామి, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాష్, తేజస్విని, గుండేటి రాజేష్, సింగరేణి శ్రీనివాస్, జాతర కమిటీ చైర్మన్ పిన్నింటి రవీందర్‌రెడ్డి, రాజయ్య, మోహన్‌రెడ్డి, నర్సింగారావు, మల్లేష్, కోయ పూజారులు పాల్గొన్నారు.