Share News

మహిళా సంఘాల రుణాల రికవరీపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:53 PM

మహిళా సంఘాల రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించా లని, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో సెర్ప్‌ కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ లక్ష్యంలో 90 శాతం పూర్తి చేశామని తెలిపారు.

మహిళా సంఘాల రుణాల రికవరీపై  దృష్టి సారించాలి

పెద్దపల్లిటౌన్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించా లని, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో సెర్ప్‌ కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ లక్ష్యంలో 90 శాతం పూర్తి చేశామని తెలిపారు. ధర్మారం, ఎలిగేడు, ముత్తా రం, శ్రీరాంపూర్‌లో రుణాల పంపిణీ తక్కువగా ఉం దని, ఆ మండలాలపై శ్రద్ధ వహించాలన్నారు. మహి ళా సంఘాల రుణాల రికవరీని ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. రుణాల చెల్లింపులో నిర్లక్ష్యం, అలసత్వం వహించే మహిళా సంఘాలపై రెవెన్యూ రికవరి యాక్ట్‌ అమలు చేయా లని, అవసరమైతే వారి ఆస్తులు, భూముల వేలం ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు మహిళ స్వయం సహాయక సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందించినా లబ్ధిదారులు నిర్మాణం ప్రారం భించడం లేదన్నారు. అధికారులు రుణం పంపిణీ చేసిన లబ్ధిదారులను ఫాలో అప్‌ చేస్తూ ఇండ్ల నిర్మా ణం ప్రారంభించేలా చూడాలని, లేనిపక్షంలో రుణ రిక వరీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇండ్లను రద్దు చేస్తామని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మహిళా సంఘాలకు కమీషన్‌ పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. ధాన్యం కేంద్రాల నిర్వాహకులు కొందరు అలాట్‌మెంట్‌కు మించి రైస్‌మిల్లులకు ధాన్యం తరలించినట్లు గుర్తించామని, రాబోయే సీజన్‌ నుంచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కావ ద్దని కలెక్టర్‌ స్పష్టం చేశారు. వీఓఏ భవనాల నిర్మా ణానికి గ్రామ పంచాయతీ తీర్మానంతో ప్రతిపాద నలు జనవరి నాటికి పంపాలన్నారు. వీహబ్‌ను వచ్చే వారం ప్రారంభించే అవకాశం ఉందని, ఆసక్తి గల మహిళలకు అవసరమైన శిక్షణ అందించేందుకు రిజిస్టర్‌ చేయాలన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, అదనపు డిఆర్డిఓ రవీందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:53 PM