• Home » Sircilla

Sircilla

సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి

సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి

పేద ప్రజల కోసం, స్వాతంత్య్ర సాధన కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) డిసెంబర్‌ 26న శత వసంతాల సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆ పార్టీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు.

మూడు రోజులు పత్తి కొనుగోళ్లు నిలిపివేత

మూడు రోజులు పత్తి కొనుగోళ్లు నిలిపివేత

మూడు రోజుల పాటు జిల్లాలోని మార్కెట్‌ యార్డులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకురావద్దని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష రైతులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో పత్తి కొనుగోళ్లపై నిర్వహించిన సమావేశంలో మాటా ్లడుతూ పత్తి జిన్నింగ్‌ మిల్లు అసోసియేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిన్నింగ్‌ మిల్లర్లు, సీసీఐ, ప్రైవేటు కొనుగోలు నిలిపివేస్తున్నారని కలెక్టర్‌ పేర్కొన్నారు.

వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

రైతు లు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కొండా లక్ష్మణ్‌ ఉద్యానవన శాఖ విశ్వ విద్యాలయం ఉపకులపతి దండ రాజిరెడ్డి అన్నారు. కూనారంలో సోమవారం కృషి విజ్ఞాన కేంద్రం రామ గిరి ఖిల్లా, వ్యవసాయ అనుబంధ శాఖల సహ కారంతో రైతు సదస్సు నిర్వహించారు.

ధాన్యం బోనస్‌ డబ్బులు చెల్లిస్తాం

ధాన్యం బోనస్‌ డబ్బులు చెల్లిస్తాం

త్వరలోనే యాసంగి,వానకాలం సన్న రకాలకు బోనస్‌ డబ్బులు చెల్లిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సోమవారం కొలనూర్‌, గోపరపల్లిలో వ్యవసాయ సహకార సంఘం, ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

జిల్లాలో 48 వేల ఎకరాల్లో పత్తి సాగు

జిల్లాలో 48 వేల ఎకరాల్లో పత్తి సాగు

జిల్లాలో 48వేల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారని, తద్వారా 5.5 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందనే అంచనా వేసిన ట్లు జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి ప్రవీణ్‌ రెడ్డి అన్నారు. చిన్నకల్వలలోని శ్రీవెంకటేశ్వర జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌రావుతో కలిసి సోమవారం ప్రారంభించారు.

ఏఐ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందించాలి

ఏఐ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందించాలి

ఏఐ ల్యాబ్‌ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందించాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం రంగాపూర్‌లోని జిల్లా పరిషత్‌, ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఏఐ కంప్యూటర్‌ ల్యాబ్‌ ను పరిశీలించారు.

ఒకే గది... ఐదు తరగతులు

ఒకే గది... ఐదు తరగతులు

ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరతతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సమస్యలు ఎదుర్కొం టున్నారు. మంథని మండలంలో 42 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అందులో 10 పాఠశాలలో సింగిల్‌ తరగతి గది ఉన్న పాఠశాలలు ఉండగా రెండు పాఠశాలలకు సొంత భవనాలు లేక ప్రైవేటు భవనాలలో పాఠశాలలు నిర్వహిస్తున్నారు.

బకాయిల చెల్లింపులు వేగవంతం చేయాలి

బకాయిల చెల్లింపులు వేగవంతం చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ బకాయిల వెంటనే చెల్లించాలని ఎస్‌టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవన్‌లో జిల్లా శాఖ అధ్యక్షుడు మేరుగు సతీష్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

 రైతులు ఆందోళన చెందవద్దు

రైతులు ఆందోళన చెందవద్దు

తుఫాన్‌ కారణంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనిపించే బాధ్యత తనదేనని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు హామీ ఇచ్చారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధం

కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధం

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధమని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి