అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:56 PM
అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. ఐటీఐ మైదానంలో వాకర్స్ ట్రాక్, స్విమ్మింగ్‌ఫూల్, బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి సీసీ రోడ్డు, డైన్రేజీలు మహిళా పోలీస్‌స్టేషన్‌లో వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ సుమారు 4 కోట్ల 59 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
పెద్దపల్లి టౌన్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. ఐటీఐ మైదానంలో వాకర్స్ ట్రాక్, స్విమ్మింగ్‌ఫూల్, బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి సీసీ రోడ్డు, డైన్రేజీలు మహిళా పోలీస్‌స్టేషన్‌లో వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ సుమారు 4 కోట్ల 59 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అనంతరం చందపల్లి, తెనుగువాడలో సెంటర్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభించారు. చందపల్లి 54 మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసి భూమి పూజ చేసి పత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీఐలో వాకింగ్ ట్రాక్ లైట్లతో పాటు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, పట్టణం సుందరంగా మారుతుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పాలకులు పెద్దపల్లి పట్టణాన్ని దోచుకుని, అభివృద్ధిని మర్చిపోయారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అధికా రంలోకి వచ్చాక పెద్దపల్లి పట్టణాన్ని సుందరంగా మారుస్తున్నామని తెలి పారు. అభివృద్ది, సంక్షేమాన్ని చూసి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామాలు, పట్టణాల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తా మని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో పేదల సొంతింటి కల సాకారం కావడం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు నూగిల్ల మల్లయ్య, ఉప్పు రాజు, మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బూతగడ్డ సంపత్, అమ్రేష్, దొడ్డుపల్లి జగదీష్, కొమ్ము అభిలాష్, నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.