డిపో ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:46 PM
పదేళ్లుగా బకాయిలు చెల్లిం చకుండా ఆర్‌టీసీ యాజమాన్యం వేధిస్తుందని, తమకు చావే దిక్కని ఆర్‌టీసీ రిటైర్డ్ ఉద్యోగులు నాగేందర్, వెంగళ కనకయ్య అన్నారు. బకాయిలు చెల్లించాలంటూ శనివారం గోదావరిఖని ఆర్‌టీసీ డిపో ఎదుట ఆందోళనకు దిగారు.
కళ్యాణ్‌నగర్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): పదేళ్లుగా బకాయిలు చెల్లిం చకుండా ఆర్‌టీసీ యాజమాన్యం వేధిస్తుందని, తమకు చావే దిక్కని ఆర్‌టీసీ రిటైర్డ్ ఉద్యోగులు నాగేందర్, వెంగళ కనకయ్య అన్నారు. బకాయిలు చెల్లించాలంటూ శనివారం గోదావరిఖని ఆర్‌టీసీ డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్‌టీసీలో వివిధ విభాగాల్లో పని చేసి రిటైర్డ్ అయిన తమకు 2015 నుంచి ఇప్పటి వరకు బకాయిలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆర్‌పీఎస్ 2017, ఏరియర్స్ 2024 వరకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇవ్వలేదని, అప్పులు తీరక పిల్లల పెళ్లిళ్లు చేయలేక అనారోగ్య కారణాల వల్ల మానసికంగా ఇబ్బం దులు పడుతున్నామని, ఈపీఎఫ్‌ఓ తిరస్కరణకు గురి చేసి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తమకు ఈ నెల 20లోపు బకాయిలు చెల్లించకపోతే 21న బస్ భవన్‌ను సారధ్య కమిటీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులు కదిలి రావాలని పిలుపు నిచ్చారు. విజయ్, బెంజిమెన్, డీఎన్‌రావు, మల్లేషం, మురళి పాల్గొన్నారు.