అంబరాన్నంటిన భోగి సంబరాలు
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:53 PM
హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దులతో విన్యాసాలు.. చిన్నారులు కోలాటాలు, మహిళల రంగవల్లు లతో సందడి నెలకొంది. సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్‌లో నిర్వహిం చిన భోగి సంబరాలు అంబరాన్నంటాయి.
సుల్తానాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దులతో విన్యాసాలు.. చిన్నారులు కోలాటాలు, మహిళల రంగవల్లు లతో సందడి నెలకొంది. సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్‌లో నిర్వహిం చిన భోగి సంబరాలు అంబరాన్నంటాయి. వార్డుకు చెందిన వారు సామూ హికంగా భోగి మంటలు వెలిగించారు. మరో వైపు అందంగా వేసిన వేదిక పై పాలను పొంగించారు. అనుమాల అరుణ బాబురావుతో పాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు. గాంధీనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త నీతూరెడ్డి భోగి పండుగ సందర్భంగా ఇంటి ముందు వేసిన ముగ్గు సనాతన ఽధర్మం మన జీవన మార్గాన్ని ప్రతిబింబించాయి. దేవుడు కేవలం ఆలయంలోనే కాదు మన హృదయంలో కూడా ఉన్నాడనన్న భావాన్ని తెలుపుతుందన్నారు.
కమాన్‌పూర్, (ఆంధ్రజ్యోతి): ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో భోగి వేడుకలను నిర్వహించారు. ఇటీవల ఎన్నికైన యువసేన అధ్యక్షుడు మల్యాల శేఖర్, ఉపాధ్యక్షుడు గుంజపడుగు నరేష్‌ను బీజేపీ జిల్లా అధ్య క్షుడు మచ్చగిరి రామన్న సన్మానించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లా డుతూ చత్రపతి శివాజీ యువసేన కార్యక్రమాలు మరింత చురుగ్గా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, దేశం కోసం ధర్మం కోసం ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు.
యైుటింక్లయిన్‌కాలనీ, (ఆంధ్రజ్యోతి): భోగి పండగను బీజేవైఎం ఆధ్వ ర్యంలో కాలనీలో ఘనంగా నిర్వహించారు. అబ్దుల్‌కలాం స్టేడియంలో ప్రధాని మోదీ చిత్రటాలతో కూడిన పతంగులను నాయకులు పంపిణీ చేశారు. చిన్నారులు, ప్రజలతో కలసి బీజేపీ నాయకులు పోటాపోటీగా పతంగులను ఎగురవేశారు. యువమోర్చా మండల అధ్యక్షుడు ఐలవేని అనిల్, నాయకులు మూకిరి రాజు, మారెపల్లి శ్రీనివాస్, ఆకుల కుమార్, బద్రి దేవేందర్, పాష, పొట్ల వెంకటి, చొప్పరి లక్ష్మీనారాయణ, సాయిప్రణీత్, నరేష్, ధనుష్, కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
కోల్‌సిటీటౌన్, (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కార్మిక వాడలు, బస్తీలలో తెల్లవారు జామున భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. కళ్యాణ్‌నగర్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వ్యాపార కేంద్రమైన లక్ష్మీ నగర్‌లో భోగి మంటలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మహి ళలు ఇళ్ళ ముందు అందమైన రంగవల్లులు వేసి సాంప్రదాయ బద్దంగా గొబ్బెమ్మలు పెట్టి అలంకరించారు. పలు ఆలయాల్లో భక్తులు దైవ దర్శనాలు చేసుకున్నారు.
కళ్యాణ్‌నగర్/మార్కండేయకాలనీ, (ఆంధ్రజ్యోతి): గోదావరిఖనిలో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులను వేశారు. ముగ్గులను ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు, నవ ధాన్యాలు, రేగుపండ్లు, పలు రకాల పూలతో అలంకరించారు. లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగర్, పరుశరాంనగర్, రాజ లక్ష్మికాలనీలతో పాటు పలు కాలనీల్లో భోగి వేడుకలను నిర్వహించారు. గురువారం మకర సంక్రాంతి, శుక్రవారం కనుమ వేడుకలు జరుగను న్నాయి. కళ్యాణ్‌నగర్‌లో కిరాణమర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి పండుగ సందర్భంగా భోగి మంట వేశారు. చొక్కారపు వెంకటేశ్వర్లు, చిట్టిమల్ల కిశోర్, చందర్, సత్యప్రసాద్, శశిధర్, సత్యనారాయణ, నవీన్, విజయ్ పాల్గొన్నారు. తిరుమల్‌నగర్‌లో బీజేపీ నాయకుడు క్యాతం వెం కటరమణ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. కోమళ్ల మహేష్, పెద్దపల్లి రవీందర్, కొండపర్తి సంజీవ్, కోడూరి రమేష్, శ్రీనివాస్, రాజేష్, గోపాల్, వీరేశం, రాజయ్య పాల్గొన్నారు. మేదరి సంఘం ఆధ్వర్యంలో మేదరిబస్తీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ హామీ పత్రాల దహనం
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించిన భోగి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420హామీ పత్రాలను భోగిమంటల్లో వేసి కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే పుట్టి ముంచారని, కేసీఆర్ పాలనలో రైతు రాజ్యం తీసుకువచ్చేం దుకు ఎంతో కృషి చేశారన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు పాముకుంట్ల భాస్కర్, జనగామ కవిత, నారాయణదాసు మారుతి, దొమ్మేటి వాసు, జక్కుల తిరుపతి, బుర్రి వెంకటేష్, సట్టు శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్, కోడి రామకృష్ణ, ప్రశాంత్, భాను చందర్ పాల్గొన్నారు.