Share News

ఇచ్చిన హమీలన్నీ నెరవేరుస్తాం

ABN , Publish Date - Jan 17 , 2026 | 11:45 PM

ఎన్ని కల సందర్భంలో తాము ఇచ్చిన హామీ లన్నింటినీ నెరువేరుస్తామని, గత పాలకుల మాదిరిగా మోసం చేసే వాళ్లం కాదని ఎమ్మెల్యే చింత కుంట విజయరమ ణారావు అన్నారు.

ఇచ్చిన హమీలన్నీ నెరవేరుస్తాం

సుల్తానాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఎన్ని కల సందర్భంలో తాము ఇచ్చిన హామీ లన్నింటినీ నెరువేరుస్తామని, గత పాలకుల మాదిరిగా మోసం చేసే వాళ్లం కాదని ఎమ్మెల్యే చింత కుంట విజయరమ ణారావు అన్నారు. సుగ్లాంపల్లి, శ్రీరాము లపల్లి గ్రామాలలో శని వారం ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లకు ముగ్గు పోశారు. అనంతరం శ్రీరాములపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతు రెండేళ్లలో ఈ రెండు గ్రామాలకు రెండు కోట్ల పనులు వెచ్చిస్తున్నామని, పదేళ్ల పాలనలో ప్రజలను అన్నింటా మోసం చేశారన్నారు. రానున్న రోజుల్లో పలు అభివృద్ధి పనులు చేసి చూపుతా మని స్పష్టం చేశారు. రైతు భరోసా డబ్బులను ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చిలో జమ చేస్తా మని, ఇప్పటికే సన్నవడ్ల బోనస్‌ జమ చేశా మని గుర్తు చేశారు. రాజీవ్‌ రహదారి నుంచి శ్రీరాములపల్లి చౌరస్తా వరకు రూ.50 లక్షలతో బీటీ రోడ్డు నిర్మిస్తామన్నారు.

ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సేవలను అం దరూ సద్వినియోగం చేసుకోవాలని, గతం లోఎన్నడూ లేని విధంగా నెలకు 275కు పైగా డెలివరీ కేసులు నిర్వహిస్తున్నారని అన్నారు. కంటి పరీక్షలు, ఆపరేషన్లుతో పాటు ఎముక లకు సంబంధించిన ఐదుగురు వైద్యులు అందు బాటులో ఉన్నారన్నారు. యాభై పడకల నుంచి వంద పడకల వరకు ఆప్‌గ్రేడ్‌ చేశామని, గర్భిణీలతో సహా అందరికీ ఉచితంగా స్కానింగ్‌ చేస్తున్నారని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నవజాతశిశు సంరక్షణ మిషన్లు అందుబాటులో ఉంచామన్నారు. 52 రకాల పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యేను నాయకులు ఈర్ల శేఖర్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, పన్నాల రాములు, గాజుల రాజమల్లు, శ్రీగిరి శ్రీనివాస్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 11:45 PM