Share News

మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సింగరేణి పేరు పెట్టాలి

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:49 PM

సింగరేణి సంస్థ లక్షలాది మంది ప్రజలకు తిండి పెడుతుందని, మున్సి పల్‌ కార్పొరేషన్‌కు సింగరేణి పేరును వాడుకలోకి తీసు కురావాలని ప్రతిపాదిస్తున్నట్టు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి మూలాధారమైన సింగ రేణిని స్మరించుకునేలా అందరూ ఆమోదిస్తే పేరు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సింగరేణి పేరు పెట్టాలి

కోల్‌సిటీ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ లక్షలాది మంది ప్రజలకు తిండి పెడుతుందని, మున్సి పల్‌ కార్పొరేషన్‌కు సింగరేణి పేరును వాడుకలోకి తీసు కురావాలని ప్రతిపాదిస్తున్నట్టు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి మూలాధారమైన సింగ రేణిని స్మరించుకునేలా అందరూ ఆమోదిస్తే పేరు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం సాయం త్రం మున్సిపల్‌ జంక్షన్‌ వద్ద రూ.86లక్షల సింగరేణి నిధులతో 4.5ఎకరాల స్థలంలో నిర్మించనున్న పార్కు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ రామగుండం పునర్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టామని, దానిలో భాగంగా వ్యాపార, వాణిజ్య కేం ద్రాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సమ్మక్క - సార లమ్మ జాతర ప్రాంగణం వద్ద గోదావరి ముంపునకు గురికాకుండా మట్టిపోసి ఎత్తు పెంచి అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టామన్నారు. అక్కడ అన్నీ సౌకర్యాలతో ఫం క్షన్‌ హాల్‌ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మున్సిపల్‌ జంక్షన్‌ వద్ద అంబేద్కర్‌ పార్కు నిర్మాణాన్ని సంకల్పించామని, ఇది త్వరలోనే పూర్తి చేసి అందు బాటులోకి తీసుకువస్తామన్నారు. గోదావరి ఒడ్డున రూ.4కోట్లతో శ్మశానవాటికను అభివృద్ధి చేస్తున్నామ న్నారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌, ఇన్‌చార్జి ఎస్‌ఓ టూ జీఎం ఎల్‌ రమేష్‌, ఏఐటీయూసీ ప్రతినిధి పద్మ, కాంగ్రెస్‌ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌, దీటి బాలరాజు, సింగరేణి అధికారులు జితేందర్‌ సింగ్‌ డీజీఎం(సివిల్‌) వరప్రసాద్‌, పర్సనల్‌ మేనేజర్‌ రవీందర్‌రెడ్డి, సింగరేణి శ్రీను, కమ్యూనికేషన్‌ అధికారి హనుమంతరావు, సాంబశివరావు, కుమారస్వామి, వీరారెడ్డి పాల్గొన్నారు.

కళ్యాణ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠా కూర్‌ వైద్యులకు సూచించారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ రోగు లతో మర్యాదగా ప్రవర్తించాలని, అందుబాటులో మం దులను ఉంచుకోవాలని, 24గంటలు రోగులకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాయ కులు మహంకాళి స్వామి, దాసరి సాంబమూర్తి, ఉమాదేవి, గట్ల రమేష్‌ ఉన్నారు.

కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): గృహజ్యోతి పథకం కింద నెలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్‌ పొందుతున్న లబ్ధిదారులకు, రైతులకు ఎన్‌పీడీసీఎల్‌ పక్షాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభాకాంక్షలతో కూడిన సందేశాన్ని ఎన్‌పీడీసీఎల్‌ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం ఎస్‌ఈ గంగాధర్‌ ఆధ్వర్యంలో మంథని డీఈ ప్రభాకర్‌, గోదావరిఖని ఏడీఈ వెంక టేశ్వర్లు, రామగుండం ఏడీఈ రమేష్‌లు ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ను కలిసి సం దేశపత్రాలను అందజేశారు. గోదావరిఖని సబ్‌ డివి జన్‌లో 22వేల మంది గృహ జ్యోతి, 295 మంది ఉచిత విద్యుత్‌ లబ్ధిదారులు ఉన్నట్టు ఏడీఈ వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - Jan 16 , 2026 | 11:49 PM