Share News

కన్నుల పండువగా గోదా రంగనాథుల కల్యాణం

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:55 PM

బుధవారం గోదా రంగనాథుల స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. అర్చకులు ఆధ్వర్యంలో నిర్వ హించిన కల్యాణంలో దంపతులు కన్యాదాతలు గా వ్యవహరించారు.

కన్నుల పండువగా గోదా రంగనాథుల కల్యాణం

సుల్తానాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): పెరికిగిద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం గోదా రంగనాథుల స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. అర్చకులు కొండపలుకల అభిలాష్‌ స్వామి ఆధ్వర్యంలో నిర్వ హించిన కల్యాణంలో గూబ్డే సంతోష్‌ రేణుక దంపతులు కన్యాదాతలు గా వ్యవహరించారు. ఆలయ చైర్మన్‌ ఆకుల రామేశ్వర్‌ రెడ్డి, విజయలక్ష్మి, డైరక్టర్‌ కత్తెర్ల పోచాలు స్వప్న, గొట్టం అంజయ్య, టిటిడి ధర్మప్రచార పరిషత్‌ కన్వీనర్‌ మెంగని చంద్రశేఖర్‌ రాధ, భగవాన్‌, మొండయ్య, ఆయిల్ల శేఖర్‌, స్రవంతి పాల్గొన్నారు. కనుకుల ఆంజనేయ స్వామి ఆల యంలో గోదా రంగాయకుల స్వామి కల్యాణం నిర్వహించారు. సర్పంచ్‌ కర్రె కవిత కుమారస్వామి కాండూరి వాసు పాల్గొన్నారు. దేవునిపల్లి నం బులాద్రి స్వామి ఆలయంలో జరిగిన గోదా రంగనాయకుల స్వామి కల్యాణంలో కొండపాక క్రిష్ణమాచార్య పాల్గొన్నారు. ఐతరాజుపల్లి రామాలయం, భూపతిపూర్‌ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కల్యాణం వైభవంగా నిర్వహించారు.

కాల్వశ్రీరాంపూర్‌, (ఆంధ్రజ్యోతి): పెగడపల్లి కృష్ణ ఆలయంలో బుధవా రం గోదాదేవి రంగనాయక కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వేద పండితుల ప్రత్యేక పూజలతో కల్యాణం రమణీయంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్‌, సర్పంచ్‌ ఆరెల్లి రమేష్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, ఉపసర్పంచ్‌ శ్రీనివాసరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): ధనుర్మాసంలో భోగి పండుగను పురస్కరించుకొని లక్ష్మినారాయణస్వామి ఆలయంలో గోదాదేవీ-రంగనాయకుల స్వామి కల్యాణోతోత్సావాన్ని వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన కళ్యావేదిక పై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ఆలయ ప్రధాన అర్చకులు ప్రసా దాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణాన్ని భక్తులు వీక్షించారు. లక్ష్మినారాయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని మహిళలు నెల రోజుల పాటు తిరుప్పావై నిర్వహించారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనాన్ని పురస్కరించుకొని అయ్యప్పస్వామి ఆలయంలో స్వామి వారి మూల విరాట్‌, ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పెద్దమ్మతల్లికి గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. వేర్వురుగా జరిగిన ఈకార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

రామగిరి, (ఆంధ్రజ్యోతి): కల్వచర్ల సంతాన వేణుగోపాలస్వామి ఆల యంలో కన్నుల పండువగా గోదారంగనాయకుల కల్యాణం నిర్వహించారు. సర్పంచ్‌ రేండ్ల శారద, ఆలయకమిటీ చైర్మన్‌ రేండ్ల కుమారస్వామి ఆధ్వ ర్యంలో కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయం ఆవరణలో అలంకరించిన వేదిక పై ఉత్సవ మూర్తులకు వేదపండితులు కల్యాణం నిర్వహించారు. ఆర్జీ-3 జీఎం మధుసూదన్‌, సీఐ రాజు, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - Jan 14 , 2026 | 11:55 PM