Share News

రిజర్వేషన్లపై ఉత్కంఠ

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:53 PM

మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. రిజర్వే షన్లపై కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు శనివారం తెరపడనుంది. మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్‌ను హైద రాబాదులోని సీడీఎంఏ ఆఫీసులో, పెద్దపల్లిలోని కలె క్టరేట్‌లో ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగా వార్డుల కేటాయింపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో అధికారులు డ్రా నిర్వహించనున్నారు.

రిజర్వేషన్లపై ఉత్కంఠ

మంథని, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. రిజర్వే షన్లపై కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు శనివారం తెరపడనుంది. మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్‌ను హైద రాబాదులోని సీడీఎంఏ ఆఫీసులో, పెద్దపల్లిలోని కలె క్టరేట్‌లో ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగా వార్డుల కేటాయింపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో అధికారులు డ్రా నిర్వహించనున్నారు. దీంతో వార్డులు, చైర్మన్‌ రిజ ర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. రిజర్వేషన్లు అను కూలంగా వచ్చిన వారు ఓటర్ల ప్రసన్నం కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు. మున్సిపల్‌ పరిధిలో 13 వార్డుల్లో 14,402 మంది ఓటర్లు ఉండగా వారిలో 6,949 మంది పురుషులు, 7,452 మంది మహిళలు, 1ఇతరులు ఉన్నారు.

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ పట్ట ణంలోని పోలింగ్‌ బూత్‌ల వారీగా తయారు చేసిన ఓటర్ల జాబితాను మున్సిపల్‌ కమిషనర్‌ టి రమేష్‌ ప్రకటించారు. మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్‌, సిబ్బంది ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. కమిషనర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 వార్డులు ఉన్నాయని, ప్రతీ వార్డు పరిధిలో వేయి నుంచి పన్నెండు వందల మంది ఓటర్లు ఉన్నా రన్నారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో 750 మంది ఓటర్లకు మించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలు లేదని ఆ ప్రకారం 15 వార్డులకు 30 పోలింగ్‌ కేంద్రాల ను ఎంపిక చేశామన్నారు. జడ్పీ బాలికల హైస్కూల్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణం, కోర్డు సమీ పంలోని ప్రభుత్వ స్కూల్‌, అశోక్‌నగర్‌లోని ప్రభుత్వ స్కూల్స్‌లో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. మున్సిపాలిటీలో 15 వార్డులకుగాను 16862 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 15 వార్డుల్లో ఒకటి ఎస్టీలకు, రెం డు ఎస్సీలకు కెటాయిస్తారన్నారు. రిజర్వేషన్ల వివరా లను శనివారం కలెక్టర్‌ ప్రకటించనున్నట్లు తెలిపారు.

కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థలో పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య 277కు చేరింది. గత ఎన్నికల్లో 242 ఉండగా ఈసారి 35పెరిగాయి. ప్రజల సౌకర్యం కోసం ఒక్కో బూత్‌కు సరాసరి 750ఓట్లు ఉం డేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించడంతో పోలింగ్‌ స్టేషన్లను పెంచారు. వీర్లపల్లి, లింగాపూర్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇతర ప్రాం తాల్లో ఓటు వేసే అవసరం లేకుండా పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

శుక్రవారం అదనపు కలెక్టర్‌, కమిష నర్‌ అరుణశ్రీ పోలింగ్‌ స్టేషన్ల జాబితా, పోలింగ్‌ కేం ద్రాల వారీగా ఓటరు జాబితాను విడుదల చేశారు. ఈఈ రామన్‌, సెక్రటరీ ఉమామమేశ్వర్‌రావు, సూపరిం టెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌, టీపీబీఓలు హిమజ, సింధుజ, శ్రావణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2026 | 11:53 PM