Share News

సమన్వయంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:59 PM

ప్రభుత్వశాఖల మధ్య సమన్వ యంతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని రామగుం డం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజల ప్రాణ రక్షణే ఉద్దేశ్యంగా చేపట్టిన అరైవ్‌... అలైవ్‌... కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సమన్వయంతోనే  రోడ్డు ప్రమాదాల నివారణ

కోల్‌సిటీ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వశాఖల మధ్య సమన్వ యంతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని రామగుం డం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజల ప్రాణ రక్షణే ఉద్దేశ్యంగా చేపట్టిన అరైవ్‌... అలైవ్‌... కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్‌, ఎడ్యుకేషన్‌, రోడ్డు రవాణా, ఆరోగ్య, ఆర్‌అండ్‌బీ తదితర శాఖ అధికారులు, ఉద్యోగులకు భద్రత నియమాల ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సురక్షితంగా తమ గమ్యస్థానం చేరుకోవడమే లక్ష్యంగా అరైవ్‌... అలైవ్‌... కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులతో సమన్వయం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు రోడ్డు భద్రత నియమాలు పాటించడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిల వాలన్నారు. ఈ ఏడాది కమిషనరేట్‌ పరిధిలో 30శాతం ప్రమాదాల నివా రణ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపడం, సేఫ్‌ అండ్‌ డిఫెన్సింగ్‌ డ్రైవింగ్‌ పద్ధతులు అనుసరించడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చునన్నారు. కారు, ఇతర ఫోర్‌ వీల్‌ నడిపే వాహనదారులు సీటుబెల్ట్‌ వినియోగం తప్పనిసరి ఆయన పేర్కొన్నారు. వాహనదారుడి వద్ద డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, రిజిస్ర్టేషన్‌ పత్రాలు ఉండాలన్నారు. ఇన్సూరెన్స్‌ చేయడం ద్వారా ప్రమాదాల సమయంలో ఆర్థిక భద్రత పెరుగుతుందని సీపీ తెలిపారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు రోడ్డు వెడల్పుతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టామని, జిల్లా కేంద్రం రోడ్డు సేఫ్టీ సమావేశాలు నిర్వహిస్తూ వారి సూచనలు అమలు చేస్తున్నామ న్నారు. రోడ్డు భధ్రత గురించి పోలీస్‌ అధికారులచే సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సీపీ హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ జీ కృష్ణ, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వర్‌రావు, ఎంఈఓ మల్లేష్‌, ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ కృపాభాయి, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌ సాగర్‌, ఆర్‌అండ్‌బీ, ట్రాఫిక్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2026 | 11:59 PM