Share News

విమర్శలకు అభివృద్ధితోనే జవాబు

ABN , Publish Date - Jan 17 , 2026 | 11:41 PM

రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి, అభివృద్ధికి తాను ఎల్లవే ళలా కృషి చేస్తున్నానని, ఓర్వలేని వారు చేస్తున్న విమర్శ లకు అభివృద్ధితోనే జవాబు చెబుదామని ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. శనివారం పట్టణంలో రూ.20 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను ఆయన ప్రారం భించారు.

విమర్శలకు అభివృద్ధితోనే జవాబు

గోదావరిఖని, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి, అభివృద్ధికి తాను ఎల్లవే ళలా కృషి చేస్తున్నానని, ఓర్వలేని వారు చేస్తున్న విమర్శ లకు అభివృద్ధితోనే జవాబు చెబుదామని ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. శనివారం పట్టణంలో రూ.20 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను ఆయన ప్రారం భించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లా డారు. తాను రామగుండంలో పుట్టి పెరిగానని, తన బాల్య మంతా ఇక్కడే కొనసాగిందని, ఇక్కడి ప్రతి ఇంటికి తనకు అనుబంధం ఉందన్నారు. వరంగల్‌, కరీంనగర్‌కు దీటుగా రామగుండాన్ని తీర్చిదిద్దాలన్నదనే తన ధ్యేయమని, నగ రాన్ని విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. రూ.150కోట్లతో ప్రభుత్వాసుపత్రి నిర్మా ణం జరుగుతుందని, గుండెపోటు వస్తే హైదరాబాద్‌ వం టి దూరప్రాంతాలకు వెళ్లకుండా క్యాత్‌ల్యాబ్‌ను అందు బాటులోకి తీసుకువస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగు తున్నాయని, మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు అదనంగా ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టామన్నారు. గోదావరి వద్ద సమ్మక్క -సారలమ్మ జాత రకు రూ.6కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.230 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌తో పాటు పట్టణ నలువైపులా లింగాపూర్‌, అంతర్గాం, కుందనపల్లి, గోదావరిఖని వైపు రహదారులన్నీ విస్తరించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరంలో సాంకేతిక కళాశాలలతోపాటు సమీపంలో ఎయిర్‌ పోర్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాముడు నడియాడిన రామునిగుండాల వద్ద రూ.12కోట్లతో 108 అడుగుల ధనుర్భాణ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.2కోట్లతో మైనార్టీ కమ్యూ నిటీ హాల్‌ నిర్మిస్తున్నామని, మైనార్టీ శ్మశానవాటికను రూ.4.11కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ సర్కారు హయాంలో పేదలకు సంక్షేమ పథకాలు అందు తున్నాయని, సొంతింటి కల సాకారం అవుతుందన్నారు. ఎస్‌ఈ గురువీర, ఈఈ పీవీ రామన్‌, ఉమామహేశ్వర్‌, సీనియర్‌ నాయకులు అయోధ్యసింగ్‌, కాంగ్రెస్‌ నాయ కురాలు మనాలీ ఠాకూర్‌, మహంకాళి స్వామి, అంజులు, ఈదునూరి హరి ప్రసాద్‌, కన్నూరి సతీష్‌ కుమార్‌, సలీంబేగ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 11:41 PM