Home » Sircilla
అయోధ్య కోర్టు కేసు గెలిపించిన, రామ మందిరాన్ని కట్టించినా అని గొప్పలు చెప్పుకునే మోదీ రామమందిరంలో భక్తుల విరాళాలు చోరీకి గురైతే ఎందుకు మాట్లాడడం లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలో ఎంపీ నిధులతో చేసిన పలు అభివృద్ధి పనులను ఎంపీ ప్రారంభించారు.
ప్రైవేట్ పాఠశాలల హంగులు ఆర్భాటాలు చూసి పిల్లలను చేర్పిస్తున్నారని, ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావు అన్నారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థ వంతంగా అమలు చేసి అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు.
రామగుండంలో వంద పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని చౌరస్తాలో సం తకాల సేకరణ, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్‌లో ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి ఎంచర్ల సాత్విక్‌కు ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యం లో శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నివాళులర్పించారు.
బందంపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దేందుకు మూడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. శుక్రవారం మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ నూగిళ్ళ మల్లయ్య, అధికారులతో కలిసి పరిశీలించారు.
రాష్ట్రంలో నెల కొన్న సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు లు అధిక నీటి అవసరమయ్యే వరి పంటలకు బదు లు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలె క్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కొలనూర్ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపో యని కారణంగానే రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీఎస్‌టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమల్ల రాకేష్‌కు మార్ విమర్శించారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. ప్రజారోగ్యశాఖ ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రశాంత్‌నగర్, శ్రీనగర్ కాలనీల్లో పరిశీలించారు.
భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం సబ్బితం పంచాయతీ కార్యా లయంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే పలు సమస్యలు పరిష్కారమయ్యా యన్నారు.