Share News

అమృత్‌ పనులను త్వరగా పూర్తిచేయాలి

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:46 PM

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం మేయర్‌ మహంకాళి స్వామి పరిశీలించారు. ప్రజారోగ్యశాఖ ఇంజనీరింగ్‌ విభాగం, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో కలిసి ప్రశాంత్‌నగర్‌, శ్రీనగర్‌ కాలనీల్లో పరిశీలించారు.

అమృత్‌ పనులను త్వరగా పూర్తిచేయాలి

కోల్‌సిటీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం మేయర్‌ మహంకాళి స్వామి పరిశీలించారు. ప్రజారోగ్యశాఖ ఇంజనీరింగ్‌ విభాగం, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో కలిసి ప్రశాంత్‌నగర్‌, శ్రీనగర్‌ కాలనీల్లో పరిశీలించారు. శ్రీనగర్‌ కాలనీలో కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మల్కాపూర్‌ చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా పనుల్లో వేగం పెంచాలని, త్వరితగతి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కార్పొరేటర్లు వడ్లూరి రవి, వెంగళబాపు, ప్రజారోగ్యశాఖ ఏఈలు మౌనిక, మనోజ్‌, మున్సిపల్‌ ఏఈ తేజస్విని, టీపీఎస్‌ నవీన్‌, నాయకులు భరత్‌గౌడ్‌, అభిషేక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 11:46 PM