ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:01 AM
ప్రైవేట్ పాఠశాలల హంగులు ఆర్భాటాలు చూసి పిల్లలను చేర్పిస్తున్నారని, ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావు అన్నారు.
పెద్దపల్లి రూరల్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ పాఠశాలల హంగులు ఆర్భాటాలు చూసి పిల్లలను చేర్పిస్తున్నారని, ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావు అన్నారు. శనివారం పెద్దకల్వల, నిట్టూరు, తుర్కలమద్దికుంట, బొంపల్లి, రాగినేడు, అప్పన్నపేట గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో రూ.2.55కోట్ల డీఎంఎఫ్‌టి నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పెద్దకల్వలలో రూ.5 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, బొం పెల్లిలోని ఆర్‌అండ్‌బి రోడ్డు నుండి తెనుగుపల్లి వరకు రూ.50 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పెద్ద పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయని, కాంగ్రెస్ ప్రజాప్రభు త్వంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. పెద్దకల్వల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 19 లక్షలు, నిట్టూరు పాఠశాలకు రూ. 45 లక్షలు, తుర్కలమద్దికుంటకు రూ.48 లక్షలు, బొంపల్లికి రూ.25 లక్షలు, రాగినేడుకు రూ.58 లక్షలు, అప్పన్నపేటకు రూ. 60.50 లక్షల నిధులను వెచ్చించామన్నారు. పెద్దపల్లి మండలం, మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.5.70 కోట్లను మం జూరు చేయించానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని పాఠశాలల్లో చదివే విద్యా ర్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని తెలి పారు. కాంగ్రెస్ సర్కారు విద్యారంగం అభివృ ద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్త్తుందని ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచామని, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందిస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల న్నారు. నిట్టూరు పాఠశాలలో చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. అప్పన్నపేట జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రభుత్వ విప్‌కు పూలతో స్వాగతం పలికారు. సర్పంచ్ ఆరె సంతోష్‌కు మార్, పాలకవర్గం గజమాలతో సన్మానించారు. పెద్దపల్లి సింగిల్ విండో చైర్మన్ ముత్యాల నరేష్, సర్పంచ్‌లు నర్ల కనుకమ్మపోల్‌రాజు, ఆకుల సువర్ణశ్రీనివాస్, గోగు రాజయ్య, దాడి మౌనికసంతోష్, సోమ కుమార్, ఆరె సంతోష్ కుమార్, ఉపసర్పంచ్‌లు పంబాల రాజు, తిరు పతి, పర్స లక్ష్మీశంకర్, గుమ్మడి సోనివిజయ్, కాంగ్రెస్ నాయకులు ఎడెల్లి శంకరయ్య, మం దల సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, సంతోష్, గుర్రాల రాజు, ఆడెపు వెంకటేషం, జడల రాజు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.