Share News

మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణానికి రూ.3 కోట్లు

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:27 PM

బందంపల్లి చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా తీర్చిదిద్దేందుకు మూడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. శుక్రవారం మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మాణ పనులను మున్సిపల్‌ చైర్మన్‌ నూగిళ్ళ మల్లయ్య, అధికారులతో కలిసి పరిశీలించారు.

మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణానికి రూ.3 కోట్లు

పెద్దపల్లి టౌన్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): బందంపల్లి చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా తీర్చిదిద్దేందుకు మూడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. శుక్రవారం మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మాణ పనులను మున్సిపల్‌ చైర్మన్‌ నూగిళ్ళ మల్లయ్య, అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు బందంపల్లి చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా నిర్మిస్తున్నామని తెలిపారు. మినీ ట్యాంక్‌బండ్‌ పనులు పరిశీలిం చిన సమయంలో చెరువు కట్ట వద్ద మరింత సుందరంగా ఉండేందుకు తీగల వంతెన కూడా నిర్మాణం చేపడతామని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మినీ ట్యాంక్‌ బండ్‌ పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పెద్దపల్లి పట్టణాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌, కౌన్సిలర్‌,పురేళ్ళ శైలజా సుధాకర్‌, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:27 PM