విద్యార్థి సాత్విక్‌కు ఘన నివాళి
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:29 PM
అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్‌లో ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి ఎంచర్ల సాత్విక్‌కు ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యం లో శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నివాళులర్పించారు.
కోల్‌సిటీటౌన్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్‌లో ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి ఎంచర్ల సాత్విక్‌కు ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యం లో శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నివాళులర్పించారు. విద్యా ర్థులు మానవహారం నిర్వహించి సాత్విక్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి బైరిమల దుర్గాప్రసాద్ మాట్లాడు తూ లింగాపూర్ మోడల్ స్కూల్‌లో క్రికెట్ ఆడుతున్న సమయంలో బంతి తీసుకురావడానికి వెళ్లిన సాత్విక్ ప్రమాదవశాత్తు మృతి చెందడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఘటనకు బాధ్యులైన పీఈటీ, ప్రిన్సిపాల్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. పెద్దపల్లి ఆర్‌డీఓ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కొంటు సాగర్, ధనాల మహేష్, సురేష్ తదితర విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.