Share News

సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:44 PM

భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం సబ్బితం పంచాయతీ కార్యా లయంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భూభారతి పోర్టల్‌ ద్వారా ఇప్పటికే పలు సమస్యలు పరిష్కారమయ్యా యన్నారు.

సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

పెద్దపల్లి రూరల్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం సబ్బితం పంచాయతీ కార్యా లయంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భూభారతి పోర్టల్‌ ద్వారా ఇప్పటికే పలు సమస్యలు పరిష్కారమయ్యా యన్నారు. భూముల విస్తీర్ణంలో తేడాలు, ఇతర సమస్యల పరిష్కారానికి రీ సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 1937లో భూ సర్వే జరిగిందని, ప్రస్తుతం అన్ని గ్రామాల్లో సమగ్ర రీ సర్వే నిర్వహిం చాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో 190 రెవెన్యూ గ్రామా లు ఉండగా, మొదటి దశలో 70 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. రీ సర్వేలో భాగంగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి, అనంతరం ఇళ్లు, ప్రభు త్వ ఆస్తులు, వ్యవసాయ భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేస్తామని తెలిపారు. సర్వే ప్రక్రియను ఆధునిక యంత్రాల సహా యంతో నిర్వహిస్తామని వెల్లడించారు. సర్వే అనంతరం వివరాలను ప్రకటించి ప్రజలకు 21 రోజుల గడువు ఇస్తామని, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి భూధార్‌ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. రోజుకు సుమారు 40 నుంచి 50 ఎకరాల వరకు సర్వే నిర్వహిస్తామని, ఏ భూములను సర్వే చేస్తారనే సమాచారాన్ని ముందుగానే అందిస్తామని, సంబంధిత రైతులు నిర్దేశిత సమయంలో భూముల వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు. రీ సర్వే ద్వారా రూపొందించే వివరాలు రాబోయే 60 నుంచి 70 సంవత్సరాల వరకు ఉపయోగపడేలా ఉంటాయని కలెక్టర్‌ తెలిపారు. తహసీల్దార్‌ రాజయ్య, సర్పంచ్‌ నూనె సరోజన, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 11:44 PM