విరాళాల చోరీ కేసులో మోదీ మౌనం
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:03 AM
అయోధ్య కోర్టు కేసు గెలిపించిన, రామ మందిరాన్ని కట్టించినా అని గొప్పలు చెప్పుకునే మోదీ రామమందిరంలో భక్తుల విరాళాలు చోరీకి గురైతే ఎందుకు మాట్లాడడం లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలో ఎంపీ నిధులతో చేసిన పలు అభివృద్ధి పనులను ఎంపీ ప్రారంభించారు.
ధర్మారం, జూలై 18 (ఆంధ్రజ్యోతి) అయోధ్య కోర్టు కేసు గెలిపించిన, రామ మందిరాన్ని కట్టించినా అని గొప్పలు చెప్పుకునే మోదీ రామమందిరంలో భక్తుల విరాళాలు చోరీకి గురైతే ఎందుకు మాట్లాడడం లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలో ఎంపీ నిధులతో చేసిన పలు అభివృద్ధి పనులను ఎంపీ ప్రారంభించారు. ఎన్నికల సమయంలో అయోధ్య అక్షిం తలతో బీజేపీ రాజకీయం చేసిందని మండిపడ్డారు. దేవుడు పేరు చెప్పి రాజకీయం చేసే పార్టీలను ప్రజలు వ్యతిరేకించాలని సూచించారు. బీజేపీ భక్తి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో ఆ పార్టీకి ప్రజలే బుద్ది చెబుతా రన్నారు. ప్రజలు బీజేపీ 250 మంది ఎంపీలను ఇస్తే, ఈడీ, సీబీఐ కేసులతో ఎంపీలను బైయింగ్ సేలింగ్ చేస్తు వారి సంఖ్య 360 పెంచారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాజ్యాంగ విరుద్ద పనులను పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయం, ఎస్సీ కాలనీల్లో ఎంపీ నిధులతో వేసిన బోర్‌వెల్స్‌ను ప్రారంభించారు. 5 లక్షల రూపాయలతో హనుమాన్ వీధిలో నిర్మించిన సైడ్‌డ్రైన్‌ను ప్రారంభించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న బొమ్మగాని తిరుపతి గౌడ్‌ను, ఇటీవల మరణించిన పాలకుర్తి చిన్న రాజేశంగౌడ్, అమరగోని అంజయ్య గౌడ్ కుటుంబాలను పరామర్శించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, నాయకులు కాడె సూర్య నారాయణ, రాజేశం గౌడ్, ఉదయ్, ఈదుల శ్రీనివాస్, దేవికిషోర్, ఓరెం చిరంజీవి, తోడేటి రాజలింగయ్య పాల్గొన్నారు.