Share News

నీటిని ఎత్తిపోయడంలో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:48 PM

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపో యని కారణంగానే రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీఎస్‌టీఎస్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ చిరుమల్ల రాకేష్‌కు మార్‌ విమర్శించారు.

నీటిని ఎత్తిపోయడంలో ప్రభుత్వం విఫలం

పెద్దపల్లి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపో యని కారణంగానే రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీఎస్‌టీఎస్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ చిరుమల్ల రాకేష్‌కు మార్‌ విమర్శించారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ గతేడాది ఇదే సమయానికి జిల్లాలో సుమారు 2.79 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగిందని, ప్రస్తుతం 12 వేల ఎకరాల్లోనే పంట లు వేశారన్నారు. వర్షాలు కురవకపోవడం ఒక కారణమైతే, సాగునీటి వన రులను వినియోగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎస్సారెస్పీకి నీళ్లు చేరని కారణంగా చెరువులు ఎండిపోయాయని, ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఆరోపించారు. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 7 టీఎంసీల నీరు మాత్రమే ఉండటం ఆందో ళనకరమని, తాగునీటి అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి నెలకొందని చెప్పారు. గోదావరిలో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్నా వాటిని వినియోగించుకునే చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదని విమర్శించారు. కన్నె పల్లి పంప్‌హౌస్‌ ద్వారా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నింపి అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఆరోపించారు. పత్తిపాక రిజర్వాయర్‌ పనులు ప్రారంభించక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రైతుభరోసా, సన్న బియ్యం బోనస్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి హామీల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించక పోతే రైతులతో కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉప్పు రాజ్‌కుమార్‌, మోబిన్‌, స్వామి, మేకల కుమార్‌ యాదవ్‌, దేవేందర్‌ రెడ్డి, ఉప్పు శివకుమార్‌, పోసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 11:48 PM