Share News

సంక్షేమ పథకాలు ప్రతీ లబ్ధిదారుడికి చేరాలి

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:57 PM

ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థ వంతంగా అమలు చేసి అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య ఆదేశించారు.

సంక్షేమ పథకాలు ప్రతీ లబ్ధిదారుడికి చేరాలి

పెద్దపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థ వంతంగా అమలు చేసి అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సంక్షేమ నిధుల పూర్తి వివరాలను వెం టనే కమిషన్‌కు సమర్పించాలని, జిల్లాలోని గురుకులాలు, కేజీ బీవీలు, మోడల్‌ పాఠశా లల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం కలెక్టరేట్‌ (ఐడీఓసీ)లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్లు బి శ్రీరాము లు, జె అరుణశ్రీలతో కలిసి వివిధ శాఖల అధి కారులతో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, అభివృద్ధి కార్య క్రమాలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు తమ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాల పురోగతిని వివరించారు. గురుకు లాలు, సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు, కేజీబీవీలు, మోడల్‌ పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యా ప్రమా ణాలపై సమీక్షించారు. బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమం త్రితో మాట్లాడి ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహా రానికి సంబంధిం చిన 50 శాతం నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. బెస్ట్‌ అవైల బుల్‌ స్కూల్స్‌, ఓవర్సీస్‌ విద్యా పథకం, ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారం, గురుకుల విద్యాసం స్థలకు సంబంధించిన పెండింగ్‌ నిధుల వివ రాలను వెంటనే కమిషన్‌కు అందించాలని అధి కారులను ఆదేశించారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రితో సమావేశం ఉండనున్నందున మిగిలిన నిధుల విడుదల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మున్సిపాలి టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు అమలులో ఉన్న రిజర్వేషన్లను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఉపాధి కల్పన కార్యాలయం, వారధి సొసైటీ ద్వారా భర్తీ చేసే అన్ని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్‌ నిబంధన లను పారదర్శకంగా అమలు చేసి అర్హులకు న్యాయం చేయాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద వచ్చే ఫిర్యా దులపై వెంటనే కేసులు నమోదు చేసి, సత్వర విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రభు త్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తు న్నామని తెలిపారు. కమిషన్‌ సూచించిన మేరకు పెండింగ్‌ నిధుల వివరా లను సేకరించి నిర్ణీత గడువులో సమర్పిస్తా మని చెప్పారు. విద్య, ఉపాధి, జీవనోపాధి, గురుకుల విద్యాసంస్థల బలోపేతంతో ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్రాభివృద్ధికి జిల్లా యంత్రాం గం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్‌, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్‌, రేణికుంట ప్రవీణ్‌, ఆర్డీవోలు బి గంగయ్య, సురేష్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి రవీందర్‌, ఏసీపీ రమేష్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 11:57 PM