ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించాలని సంతకాల సేకరణ
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:31 PM
రామగుండంలో వంద పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని చౌరస్తాలో సం తకాల సేకరణ, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కళ్యాణ్‌నగర్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రామగుండంలో వంద పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని చౌరస్తాలో సం తకాల సేకరణ, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు మద్దెల దినేష్, ఐత శివకుమార్ మాట్లాడుతూ 2018లో ఆసుపత్రి నిర్మా ణానికి రూ.150కోట్లు మంజూరు చేసిందని, ఇప్పటికి 8సంవత్సరాలు అయినా నిర్మాణం చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఎస్‌ఐ ఆసు పత్రి నిర్మాణం కాకపోవడంతో లక్షలాది మంది కార్మికులు వైద్య సేవలకు దూరమవుతున్నారని, సరైన సమయంలో వైద్యం అందక కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా జిల్లా స్థాయి అధికారులు ఆసుపత్రి నిర్మాణానికి చొరవ చూపకపోవ డంతో రూ.150కోట్ల నిధులు వెనకకు వెళ్లేప్రమాదం ఉందని, రామగుం డంలో తక్షణమే 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. గోలివాడ చంద్రకళ, తొడుపునూరి రమేష్, లెనిన్, గౌస్, రవి, సురేష్, సునీత, సరిత, లక్ష్మి, రమాదేవి, జగదీశ్వర్ పాల్గొన్నారు.