ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:26 PM
రాష్ట్రంలో నెల కొన్న సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు లు అధిక నీటి అవసరమయ్యే వరి పంటలకు బదు లు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలె క్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కొలనూర్ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.
ఓదెల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నెల కొన్న సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు లు అధిక నీటి అవసరమయ్యే వరి పంటలకు బదు లు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలె క్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కొలనూర్ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రైతు లతో సమావేశమై పంట మార్పిడిపై అవగాహన కల్పించారు. సమీపంలోని పొలాలను సందర్శించారు. ఓదెల జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను తనిఖీ అనంతరం నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. కలె క్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిందన్నారు. బీఎల్‌వోలు ఇం టింటికీ వెళ్లి ప్రతి ఓటర్‌కు ఎన్యూమరేషన్ ఫారాలు అందించి తిరిగి సేకరించాలని ఆదేశించారు. ఓటర్లు కూడా ఫారాలను త్వరితగతిన పూర్తి చేసి బీఎల్‌వో లకు అందించాలని సూచించారు. వివిధ రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు, వలంటీర్లు, సామాజిక కార్యకర్తలు, ఓటర్లకు ఫారాలు సక్రమంగా నింపడంలో సహకరిం చాలని కోరారు. వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టుల్లో నీటినిల్వలు తగ్గాయని, గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు వరి సాగుకు బదులు చిరుధా న్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు,ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని కోరారు. అవస రమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వ్యవ సాయ శాఖ అధికారుల నిరంతరం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను రైతు లు సద్వినియోగం చేసుకోని వారి సూచనల మేరకు సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. విద్యా సంవత్సరా నికి రూపొం దించిన ప్రణాళిక ప్రకారం సెల బస్‌ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రతి విద్యార్థికి అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యా ర్థులతో మాట్లాడి సదుపాయాల గురించి తెలుసుకు న్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు బోధన అందించాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ భవ నాన్ని పరిశీలించారు. చిన్నచిన్న పనులను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవ సాయ అధికారి శ్రీనివాస్,తహసీల్దార్ ఎంపీడీవో అనిల్ రెడ్డి వ్యవసాయ, అధికారులు, పాల్గొన్నారు.