Home » Sankranthi festival
సంక్రాంతి పండుగను పురష్కరించుకొని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలొస్తున్నా. మామూలు రోజుల్లో చార్జీల కంటే నాటుగు రెట్లు పెంచేధారు. దీనిపై ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నగరంలోని ఆయా ఏరియాల్లో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నారు. చెనా మాంజాపై నిషేధం ఉన్నా కొన్నిచోట్ల దుకాణాల వారు గుట్టుచప్పుడుకాకుండా విక్నయిస్తున్నారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులతను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్‌బీనగర్ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.
సంక్రాంతి సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
తెలంగాణవ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొని వినూత్నంగా తీరొక్క ముగ్గులు వేస్తున్నారు. సంస్కృతీసాంప్రదాయాలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పెద్దపీట వేస్తోంది ముత్యాల ముగ్గుల పోటీల పాల్గొన్న మహిళలు తెలిపారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే గిప్ట్ ఈనెల 8వ తేదీ నుంచి అందించనున్నారు. రాజధాని చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందజేయనున్నారు.
చైనా మాంజా అమ్మినా.. వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని మలక్‌పేట ఏసీపీ సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాణాంతకంగా మారిన ఈ చైనా మాంజాను దుకాణదారులెవరూ విక్రయించవద్దన్నారు. అలాగే.. ఈ మాంజాతో గాలిపటాలు ఎగురవేసినా చర్యలేంటాయన్నారు.
దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండక్కి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా 11 రైళ్లను నడపనుంది.
చైనా మాంజా సమాచారం ఇస్తే నగదు బహుమతి అందిస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రాంణాంతకంగా మారుతున్న చైనా మాంజా అమ్మకందారుల సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎమ్మెల్యే అన్నారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు బీహెచ్‌ఈఎల్ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రితోపాటు ఇంకా ఈయా ఏరియాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.