Home » Rohit Sharma
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమవ్వాలని కొంతమంది కోరుకున్నారని, వారు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారని, అందుకే పలు రకాల విమర్శలు చేస్తున్నారని డివిలియర్స్ తెలిపాడు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయినప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.
ఓ ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే. రోహిత్ శర్మ మదిలో ఏమనుకుంటున్నాడో ఓ మెజీషియన్ చెప్పడమే దీనికి కారణం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా క్రికెటర్లు, టీవీ రిపోర్టర్లు, స్నేహితులు ఉండటం గమనార్హం.
భారత డ్రెస్సింగ్ రూమ్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును మేనేజ్‌మెంట్ ప్రకటించింది. మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మనే ఈ అవార్డు వరించింది. మూడో వన్డేలో సెంచరీ చేసిన అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా వచ్చాయి.
కానీ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం.. అద్భుత ప్రదర్శన చేయడం మాత్రం అభిమానులకు జోష్ తెప్పించింది. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న ఈ ఇద్దరి బ్యాటింగ్‌ను చూసి సిడ్నీ ప్రేక్షకులు కూడా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడు..?
సిడ్నీ వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్‌గా నిలిచిన రోహిత్ శర్మ పలు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన విదేశీ ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు. అతడు ఇప్పటివరకు సేనా(SENA) దేశాల్లో 95 సిక్స్‌లు బాదాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ( 121*)సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74*) అర్ధ శతకంతో రాణించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా ఆసీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ గిల్ అన్నాడు.
సిడ్నీ వన్డేలో విజయానంతరం దిగ్గజ క్రికెటర్లు రవి శాస్త్రి, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ కృతజ్ఞతలు తెలిపాడు. తాము ఇక ఆడతామో లేదో తెలియదన్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ శనివారం (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అద్భుత సెంచరీ(121*) చేశాడు. ఇక రోహిత్ శర్మ సెంచరీపై కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంది.
మూడో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్‌లు అందుకుని వన్డే క్రికెట్‌లో 100 క్యాచ్‌లు పట్టిన ఆరో భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని చేరుకోవడంలో రోహిత్ శర్మ భారత దిగ్గజం సౌరవ్ గంగూలీని కూడా అధిగమించాడు.