Vijay Hazare Trophy: ఆహా ఆహా.. సునాయసంగా సెంచరీలు బాదేసిన రో-కో
ABN , Publish Date - Dec 24 , 2025 | 03:09 PM
విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. వీరిద్దరూ వేరే వేరు జట్లకు ఆడుతున్నప్పటికీ.. తమ ఫామ్‌ని మాత్రం ఏమాత్రం కోల్పోలేదు. రోహిత్ సెంచరీ చేయగా.. విరాట్ హాఫ్ సెంచరీ చేసి క్రీజులో కొనసాగుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రో-కో.. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన వీరిద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఆడితే చూడాలని అభిమానులు తపిస్తున్న నేపథ్యంలో వచ్చింది.. విజయ్ హజారే ట్రోఫీ. సఫారీలతో రెండు సెంచరీలతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుండగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ముంబై తరఫున ఆడుతున్నారు. ఈ టోర్నీలోనూ రో-కో సూపర్ నాక్ ఆడుతున్నారు.
ముంబై కా చా రాజా...
జైపుర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచులో ముంబై దూకుడు ప్రదర్శింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 30.3 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసి ఆటను ముగించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 94 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, 9 సిక్సులతో 155 పరుగులు చేశాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ అంతా ముంబై ఛా రాజా అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా హిట్‌మ్యాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
కింగ్ ఆన్ ఫైర్..
ఆంధ్రతో జరుగతున్న మ్యాచులోనూ ఢిల్లీ సూపర్ నాక్ ఆడుతోంది. వన్ డౌన్‌లో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సులతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌కి ఆంధ్ర జట్టు 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకి దిగిన ఢిల్లీ 27.4 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి ఇంకా 79 పరుగులు కావాలి.
ఇవీ చదవండి:
మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్
బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ