Home » Road Accident
గద్వాల జిల్లాలోని ధరూరు మండలం రేవులపల్లి వద్దగల జూరాల ప్రాజెక్టుపై ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకులపైకి కారు దూసుకురావడంతో ఇద్దరిలో ఓ యువకుడు ఎగిరి డ్యాంలో పడి గల్లంతయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో బత్తుల బ్రహ్మయ్య, నాగమూర్తమ్మ, రమణ, ముత్యాలమ్మ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులు, బంధువులకు సమాచారం అందించారు.
శ్రీరంగపట్న ప్రాంతంలోని ఎక్స్‌ప్రెస్‌వేపై గౌడహళ్లి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్కార్ట్ వాహనం డివైడర్‌ను ఢీకొట్టి తల్లకిందులైంది. క్షతగాత్రులను మైసూరులోని ఆసుపత్రికి తరలించారు.
ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్ఆర్)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి అతి వేగంతో ఢీ కొట్టింది.
Rangareddy Road Accident: లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రియుడు, తమ్ముడితో కలిసి భర్తను హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన భార్య, అందుకు సహకరించిన ఇద్దరిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్టు ..
వారంతా నిరుపేద గిరిజనులు. మామిడి సీజన్లో కాయల కోతలకు వెళుతుంటారు. అలా ఆదివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఇసుకపల్లెలో మామిడికోతకు వెళ్లారు. పని ముగించుకుని లారీలో కాయలను వేసుకుని వస్తుండగా పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఆదివారం రాత్రి లారీ బోల్తా పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న(ఆదివారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై చోటు చేసుకుంది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి చెరవుకట్టపై బోల్తా పడింది.
అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై లారీ బోల్తా పడి తొమ్మిది మంది కూలీలు మృతిచెందగా.. 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
దేశంలో నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటి ద్వారా ఏటా లక్షలాది మంది చనిపోవడమే కాకుండా ఎంతో మంది గాయపడుతున్నారు.