Road Accident: రోడ్డు ప్రమాదంలో తిరుచానూరు ఆలయ పోటు కార్మికులు మృతి
ABN , Publish Date - Dec 09 , 2025 | 10:48 AM
తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుచానూరు అమ్మవారి ఆలయ పోటు వర్కర్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
తిరుపతి, డిసెంబర్ 9: రాష్ట్రంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయి.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటిని ప్రమదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. తాజాగా తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఈరోజు (మంగళవారం) ఉదయం తిరుపతిలోని నగరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు తిరుచానూరు అమ్మవారి ఆలయ పోటు వర్కర్లుగా గుర్తించారు. కార్మికులు ఇద్దరు తిరుపతి నుంచి తిరుత్తనికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో నగరి మండలం తడుకు పేట వద్ద ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో కారు డ్రైవర్ కూడా సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోటు కార్మికుల మృతి.. తిరుచానూరులో ఉన్న మిగిలిన పోటు కార్మికుల్లో విషాదాన్ని నింపింది.
ఇవి కూడా చదవండి...
అమెరికా టూర్‌లో లోకేష్ బిజీ.. ఓప్స్ ర్యాంప్ సీఈవోతో కీలక చర్చలు
Read Latest AP News And Telugu News