Share News

Fatal accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం.. ఏమైందంటే..

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:37 AM

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్లకూరు రైటర్‌ సత్రం వద్ద శౌర్యన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

Fatal accident:  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం.. ఏమైందంటే..
Fatal accident

నెల్లూరు, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Nellore Accident) జరిగింది. చిల్లకూరు రైటర్‌ సత్రం వద్ద శౌర్యన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులో మొత్తం 35 మంది అయ్యప్పస్వాములు ఉన్నారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయలయ్యాయి. అయ్యప్పస్వాములు గుంటూరు నుంచి శబరిమలకు వెళ్తున్నారు.


ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఇటీవల హైదరాబాద్ సరిహద్దులో ఆర్టీసీ బస్సు కంకర లోడ్‌తో ఉన్న ట్రక్‌ను ఢీకొని.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు.. దీనికంటే ముందు కర్నూలులో ప్రైవేట్ బస్సులో మంటలు వ్యాపించి 19 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

Read Latest AP News and National News

Updated Date - Dec 07 , 2025 | 11:46 AM