Home » Road Accident
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూ టర్న్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొంది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అమీన్‌తో పాటు అయన మిత్రుడికి గాయాలయ్యాయి.
హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్ ఎస్‌ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
హిమాచల్‌ప్రదేశ్ చంబా జిల్లాలోని చలువజ్ మోర్ సమీపంలో తిస్సా - బైరాగఢ్ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.
గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి నియోపోలీస్ బ్రిడ్జ్ పిల్లర్‌ను తవేరా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. వాహనాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకునే వీ2వీ (V2V), సీ-వీ2ఎక్స్ (C-V2X) వ్యవస్థల అమలుకు ముసాయిదా విడుదల చేసింది.
హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో కారుతో ఓ మైనర్ బీభత్సం సృష్టించాడు. ప్రమాదకరంగా వాహనం నడిపి ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చాడు. వరుసగా ఏడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టి విధ్వంసం చేశాడు.
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం విషాదాన్ని నింపింది.
విశాఖపట్నంలోని లంకెలపాలెం - అగనంపూడి మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఈరోజు తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.