Tragic Road Accident: పెను విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:40 AM
మీర్జాగూడలో ఓ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఐసీఎఫ్ఏఐ కాలేజ్ విద్యార్థులు చనిపోయారు. మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్‌లుగా గుర్తించారు.
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మీర్జాగూడలో ఓ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఐబీఎస్, ఐసీఎఫ్ఏఐ కాలేజీలకు చెందిన విద్యార్థులు చనిపోయారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీ చేసుకుని ఫ్రెండ్‌ను డ్రాప్ చేసి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 5 మంది ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు యువకులు చనిపోగా.. నక్షత్ర అనే యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నక్షత్రను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. నలుగురు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతుల వివరాలు..
1) కర్గాయల సుమిత్ (తండ్రి: వినయ్ కుమార్), వయసు సుమారు 20 సంవత్సరాలు.
ఐబీఎస్ కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
నివాసం: ఫ్లాట్ నెం. డీ84, వెస్ట్రన్ మెడోస్, కొకపేట, నార్సింగి.
2) శ్రీ నిఖిల్ (తండ్రి: దివంగత విజయ్), వయసు సుమారు 20 సంవత్సరాలు.
ఐబీఎస్ కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
నివాసం: ఫ్లాట్ నెం. 105, మై అబోడ్స్, మంచిరేవుల, నార్సింగి.
3) బాల్మూరి రోహిత్ (తండ్రి: విద్యాసాగర్ రావు), వయసు సుమారు 18 సంవత్సరాలు.

ఎమ్‌జీఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
నివాసం: పౌలోమీ అపార్ట్‌మెంట్, కొకపేట, రాజపుష్పా రెగాడియా సమీపంలో.
4) దేవాల సూర్య తేజ (తండ్రి: అరుణ్ కుమార్), వయసు సుమారు 20 సంవత్సరాలు.
ఐబీఎస్ కాలేజీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
నివాసం: మంచిర్యాల జిల్లా.
గాయపడిన విద్యార్థిని:
సుంకరి నక్షత్ర (తండ్రి: రవీంద్ర), వయసు సుమారు 20 సంవత్సరాలు.
ఐబీఎస్ కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.
ఇవి కూడా చదవండి
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి రేటు..
మామిడి జ్యూస్ కంటెయినర్ బోల్తా