Share News

Road Accident: మామిడి జ్యూస్‌ కంటెయినర్‌ బోల్తా

ABN , Publish Date - Jan 08 , 2026 | 06:34 AM

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మ్యాంగోజ్యూస్‌ డ్రమ్ములతో వెళుతున్న కంటెయినర్‌ లారీ ప్రమాదానికి గురైంది.

Road Accident: మామిడి జ్యూస్‌ కంటెయినర్‌ బోల్తా

చిలమత్తూరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మ్యాంగోజ్యూస్‌ డ్రమ్ములతో వెళుతున్న కంటెయినర్‌ లారీ ప్రమాదానికి గురైంది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని కోడూరుతోపు వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున బోల్తా పడింది. డ్రమ్ములు కిందపడి అందులో ఉన్న జ్యూస్‌ మొత్తం రోడ్డు పాలైంది. కోడూరు తోపులోని కుషావతి నది బ్రిడ్జిపై ఉన్న స్పీడ్‌ బ్రేకర్లను గమనించకుండా లారీని డ్రైవర్‌ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. స్పీడ్‌ బేకర్ల వద్ద సడన్‌ బ్రేక్‌ వేయడంతో లారీలో ఉన్న జ్యూస్‌ డ్రమ్ములన్నీ కంటెయినర్‌ క్యాబిన్‌పై పడ్డాయి. దీంతో క్యాబిన్‌ అమాంతం కిందికి కుంగిపోయింది. డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు వెంటనే అక్కడికిచేరుకొని కంటెయినర్‌ను పక్కకు తొలగించారు.ప్రమాదంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్డుపై జ్యూస్‌ కారణంగా ద్విచక్రవాహనదారులు జారిపడ్డారు. దీంతో పోలీసులు స్థానికులతో కలిసి ట్యాంకర్లతో నీటిని తీసుకువచ్చి రోడ్డును శుభ్రం చేసి కాస్త మెరుగుపరిచారు.

Updated Date - Jan 08 , 2026 | 06:35 AM