Road Accident: పండుగపూట ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:03 PM
మధ్యప్రదేశ్‌లో పండుగ పూట ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో గురువారం వ్యాన్-ట్రాక్టర్ ఢీకొని ఐదుగురు మృతి చెందగా.. సుమారు పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో పండుగ పూట ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో గురువారం వ్యాన్-ట్రాక్టర్ ఢీకొని ఐదుగురు మృతి చెందగా.. సుమారు పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మకర సంక్రాంతి సందర్భంగా నర్మదాపురంలోని గుడికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల మేరకు.. భోపాల్ జిల్లా బెరాసియా ప్రాంతంలో వ్యాన్, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ప్రమాద సమయంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులంతా సిరోజ్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు. మరో పది మంది గాయపడగా.. అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక హమీదియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలం వద్ద పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
11 ఏళ్ల రికార్డు.. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్!
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: శుభ్‌మన్ గిల్